Bomb cyclone: అమెరికాలో తుఫాను బీభత్సం.. 18 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ (Bomb cyclone) వణికిస్తోంది. మంచు తుపానుతో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

  • Written By:
  • Updated On - December 25, 2022 / 11:40 AM IST

అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ (Bomb cyclone) వణికిస్తోంది. మంచు తుపానుతో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 17 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలు అంధకారంలోకి జారుకున్నాయి. ముఖ్యంగా 13 రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. దేశ వ్యాప్తంగా 5,200 విమానాలు రద్దు చేశారు. ఫ్లోరిడా, మేరిలాండ్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, కెంటకీ తదితర ప్రాంతాల ప్రజలు తుపాను కారణంగా క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ “బాంబు తుఫాను” కారణంగా 18 మంది మరణించారు.

US అంతటా మంచుతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితిలో అమెరికాలో 5200 విమానాలు రద్దు చేయబడ్డాయి. అందిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా విమానయాన సంస్థలు శనివారం మధ్యాహ్నం వరకు సుమారు 5200 US విమానాలను రద్దు చేశాయి. దీంతో సెలవులకు వెళ్లే వేలాది మంది ప్రజలు నిరాశకు గురయ్యారు.

Also Read: COVID – 19 in China : డ్రాగన్‌ కంట్రీలో కోవిడ్ విలయతాండవం

మంచు తుపాను దృష్ట్యా విమానయాన సంస్థలు ఈ విమానాలను రద్దు చేశాయి. అమెరికా అంతటా మంచుతో కూడిన గాలులు వీస్తున్నాయి. కెనడా సరిహద్దుకు సమీపంలో ఉన్న హవ్రే, మోంటానాలో మైనస్ 39 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. విమానాలు, రైలు సహా రవాణా సేవలు నిలిచిపోయాయి. చాలా చోట్ల మంచులో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పాటు పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. వేలాది మంది అమెరికన్లు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. 20 కోట్ల మంది అంటే దేశ జనాభాలో దాదాపు 60 శాతం మంది చలి తీవ్రతను ఎదుర్కొంటున్నారు.

తుపాను కారణంగా అమెరికా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఇంధన వ్యవస్థ కుప్పకూలింది. తుపాను కారణంగా ట్రాన్స్‌మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దాదాపు 20 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బాంబు తుఫానులు మంచు తుఫానులకు కారణమవుతాయి. తీవ్రమైన ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయి. చల్లని గాలి వెచ్చని గాలిని ఢీకొన్నప్పుడు తుఫాను ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను బాంబోజెనిసిస్ అంటారు. బాంబ్ తుఫానులు సాధారణంగా శీతాకాలంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఈ తుఫానులు చల్లని, వెచ్చని గాలి కలవడం వల్ల ఏర్పడతాయి. వాయువ్య అట్లాంటిక్, వాయువ్య పసిఫిక్, అప్పుడప్పుడు మధ్యధరా సముద్రం మీద బాంబు తుఫానులు ఏర్పడతాయి. నేషనల్ వెదర్ సర్వీస్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త జాన్ మూర్ మాట్లాడుతూ.. గ్రేట్ లేక్స్ ప్రాంతంలో చల్లని ఆర్కిటిక్ గాలి తూర్పున చాలా వెచ్చని గాలితో కలిసినప్పుడు బాంబు తుఫాను ఏర్పడిందని చెప్పారు.