దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. శుక్రవారం పాక్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ (Dera Ismail Khan) నగరంలో ఈ పేలుడు జరిగింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి (Bomb Blast Targeting Police)కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్‌కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్ (Aizaz Mehmood) తెలిపారు. అయితే ఈ పేలుడు ఆత్మాహుతి దాడి వల్ల జరిగిందా..? బాంబు అమర్చారా..? అనేది తెలియాల్సి ఉంది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌కి సమీపంలో పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో ఈ దాడి జరిగింది. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతం ఇస్లామిక్ తీవ్రవాదులకు, పాక్ తాలిబాన్లకు ప్రధాన కేంద్రంగా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
గత కొద్దీ నెలలుగా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాల్లో తరుచుగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పాక్ ఆర్మీ, చైనా ఇంజనీర్లే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. ఇక వాయువ్య ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్లకు పట్టు ఉంది. మరోవైపు పాకిస్తాన్ బాంబు పేలుళ్లు, ఉగ్రవాద ఘటనల్లో ఆఫ్ఘన్ వాసుల ప్రమేయం ఉందని చెబుతూ, పాక్ లోని తాత్కాలిక ప్రభుత్వం వలసదారులు ముఖ్యంగా ఆఫ్ఘన్ జాతీయులను దేశం వదలి వెళ్లాలని ఆదేశించింది. ఇదిలా ఉండగానే ఈరోజు మరో బాంబు ఘటన చోటుచేసుకుంది.
Read Also : MLC Kavitha: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత