Site icon HashtagU Telugu

Iran-Israel War : తగలబడిపోతున్న ఎయిర్పోర్ట్

Mehrabad Airport

Mehrabad Airport

ఇరాన్-ఇజ్రాయెల్ (Israel -Iran)మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు మరింత భయంకరంగా మారుతున్నాయి. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న మెహ్రాబాద్ ఎయిర్‌పోర్టు(Tehran’s Mehrabad Airport)పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడికి పాల్పడింది. ఈ దాడి వల్ల ఎయిర్‌పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. ఈ దాడి పట్ల ఇరాన్ ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగిపోయాయి.

Gaddar : గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం..ఆహ్వాన పత్రికపై గద్దర్ ఫొటో లేకపోవడం బాధాకరం

మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌(Mehrabad Airport)కి మిలిటరీ, సివిల్ అవసరాల దృష్ట్యా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది ఇరాన్ రక్షణ వ్యవస్థకు కీలకమైన కేంద్రంగా నిలుస్తుంది. దీంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ‘X’లో షేర్ చేసింది. దాడి తీవ్రతను ఈ దృశ్యాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

ICRISAT : ఇక్రిశాట్ క్యాంపస్ కు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లినట్లు..?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఈ మిస్సైల్ దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళనలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఇరాన్ వర్గాలు బదులుదాడికి సిద్దమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. యుద్ధం మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రపంచదేశాలు ఉద్రిక్తతను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని పిలుపు ఇస్తున్నాయి. తహరాన్ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన ఈ దాడి, భవిష్యత్ పరిణామాలకు తలుపులు తీయబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.