టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో పెద్ద పెద్ద సిటీలలో ఒకదానిని మించి మరొకటి రెస్టారెంట్ లను అద్భుతంగా నిర్మిస్తున్నారు. అత్యాధునిక హంగులతో రెస్టారెంట్లను డిజైన్ చేస్తూ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. ఎక్కువ శాతం మనకు ఎక్కడ చూసినా కూడా ఫ్యామిలీ రెస్టారెంట్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా దేశంలో అతిపెద్ద రెస్టారెంట్ ని చూశారా? పోనీ ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో మీకు తెలుసా. మరి ప్రపంచంలో అతిపెద్ద రెస్టారెంట్ ఎక్కడ ఉందో దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ చైనాలో ఉంది. హాట్‌పాట్ రెస్టారెంట్‌గా పిలవబడే పిపా యువాన్ రెస్టారెంట్ చైనాలోని చాంగ్‌క్వింగ్ నగర సమీపంలో కొండ మధ్యలో అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో ఒక 100 మంది లేదా 200 మంది కూర్చుని తినవచ్చు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే ఆ రెస్టారెంట్లో ఏకంగా ఒకేసారి 5 వేల 800 మంది భోజనం చేసేయవచ్చు. 5000 మందికి పైగా తినవచ్చు అంటే ఆ రెస్టారెంట్ ఎంత పెద్దగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 3 వేల 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 900కు పైగా టేబుళ్లు ఈ పిపా యువాన్ రెస్టారెంట్‌లో ఉన్నాయి.
Restarent
అయితే, ఇక్కడ ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద రెస్టారెంట్‌లో మనకు బుక్ అయిన టేబుల్ ఏదో తెలుసుకోవడానికి కనీసం ఒక పావుగంటైనా టైమ్ పడుతుంది. అలాగే ఆ టేస్టీ వంటలను రుచిచూడాలంటే ఆ మాత్రం టైం వేచిచూడక తప్పదు అనుకోండి. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ పిపా యువాన్ రెస్టారెంట్ లో లభిస్తాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు, 25మంది క్యాషియర్ లతో పాటు వందల మంది క్లీనింగ్ సిబ్బంది ఇక్కడ డ్యూటీ చేస్తారు. ఆశ్చర్యపోయే విషయం మరొకటి ఏమిటంటే ఈ రెస్టారెంట్ 24 గంటల పాటు తెరిచే ఉంటుందట. ముఖ్యంగా రాత్రిళ్లు ఇక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ లైట్ల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత బ్యూటిఫుల్ గా కనిపించడమే దీనికి కారణమని రెస్టారెంట్ నిర్వహకులు చెబుతున్నారు.