Site icon HashtagU Telugu

200 Year Old Peoples: 200 ఏళ్లు దాటిన వారు 2వేల మందికిపైనే.. సంచలన ప్రకటన

150 Year Old Peoples In Us Social Security Database Biggest Fraud Elon Musk Doge

200 Year Old Peoples: 200 ఏళ్ల వయసు(150 Year Old Peoples) దాటినవారు 2వేల మందికిపైగా ఉన్నారట. 360 నుంచి 369 ఏళ్ల వయసున్న వ్యక్తి ఒకరు ఉన్నారట. ఇది అమెరికాలోని సోషల్‌ సెక్యూరిటీ డేటా విభాగం విడుదల చేసిన లెక్క. అమెరికాలో వందేళ్లు దాటినవారు దాదాపు 1.89 కోట్ల మంది ఉన్నారని  2023 సంవత్సరంలో ప్రభుత్వం నిర్వహించిన సోషల్‌ సెక్యూరిటీ ఆడిట్‌లో వెల్లడైంది. వాస్తవానికి వీళ్లంతా బతికి లేరు. వాళ్ల పేర్లతో ఎవరూ ప్రభుత్వపరమైన లబ్ధి కూడా పొందడం లేదు. ఇంతకూ ఈ లెక్కల వల్ల జరిగిన అసలు పొరపాటు ఏమిటి?  ‘డోజ్‌’ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషీయెన్సీ) విభాగం సారథి ఎలాన్ మస్క్ ఏం చెబుతున్నారు ? ఈ వార్తలో చూద్దాం..

Also Read :Gold Rush : ట్రంప్ ఎఫెక్ట్.. విమానాల్లో బంగారాన్ని తెప్పిస్తున్న బ్యాంకులు

అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసం

సోషల్‌ సెక్యూరిటీ విభాగం అనేది అమెరికాలో ప్రతినెలా పింఛన్లను పంపిణీ చేస్తుంటుంది.  దీనికి సంబంధించిన కీలక వివరాలను డోజ్ సారథి ఎలాన్ మస్క్ తెలిపారు. ‘‘వందేళ్లు దాటిన దాదాపు 1.89 కోట్ల మంది పేర్లు ఇప్పటికీ అమెరికా ప్రభుత్వ సోషల్‌ సెక్యూరిటీ విభాగం వద్ద యాక్టివ్ స్టేటస్‌లో ఉన్నాయి. అయితే వారికి పింఛన్ల పంపిణీని ఆపేశారు. వాస్తవానికి ప్రభుత్వ పింఛనుకు అర్హులైన వారి కంటే, అందులో ఉన్న పేర్ల సంఖ్యే  చాలా ఎక్కువగా ఉంది. ఈ విధంగా తప్పుడు జాబితాను నిర్వహించడం అనేది అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసం’’ అని మస్క్ చెప్పుకొచ్చారు.

Also Read :Mahayuti Tussle: ‘మహా’ చీలిక జరుగుతుందా ? షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ డౌన్

రూ.4 కోట్ల కోట్లకు లెక్క తెలియడం లేదు : ఎలాన్ మస్క్

‘‘అమెరికా ప్రభుత్వ ఖజానా విభాగం చెల్లించిన రూ.4 కోట్ల కోట్లకు  ట్రెజరీ అకౌంట్‌ సింబల్‌ (టాస్‌) లేదు. దీంతో ఆ నిధులు ఎటు వెళ్లాయో గుర్తించడం కష్టతరంగా మారింది. వాస్తవానికి ఈ కోడ్‌ వాడటం ఇప్పటివరకు ఆప్షనల్‌.  ఈవిషయాన్ని మా డోజ్ విభాగం గుర్తించి, టాస్‌ కోడ్‌‌ను వినియోగించడాన్ని తప్పనిసరి చేసింది’’ అని డోజ్ సారథి ఎలాన్ మస్క్‌ పేర్కొన్నారు.  అమెరికా ఖజానా విభాగం సమాచారాన్ని తనిఖీ చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌ ప్రభుత్వం డోజ్‌ విభాగానికి ఫుల్ పవర్స్ ఇచ్చింది.