Powerful Storm : 40 అడుగుల రాకాసి అలలు.. 10 మందిని ఈడ్చుకెళ్లాయి

Powerful Storm : దాదాపు 20 నుంచి 40 అడుగుల ఎత్తున్న రాకాసి అలలు 10 మందిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి.

  • Written By:
  • Updated On - December 31, 2023 / 04:33 PM IST

Powerful Storm : దాదాపు 20 నుంచి 40 అడుగుల ఎత్తున్న రాకాసి అలలు 10 మందిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లాయి. చివరకు ఎంతో కష్టపడి వారిని రెస్క్యూ టీమ్ రక్షించింది. రాకాసి అలలను చూసి పర్యాటకులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో 8 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతం వెంచురాలో చోటుచేసుకుంది. అక్కడ ఇప్పుడు సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్‌లో కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు వెళ్లిన వారిపైకి రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. దీంతో పర్యాటకులు, పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారీ అలల ప్రభావంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో చాలా తీర ప్రాంతాలను మూసివేశారు. ప్రజలు సముంద్ర తీరం వైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పసిఫిక్‌ మహా సముద్రం అలజడిగా మారడం వల్లే ఈవిధంగా భారీ అలలు(Powerful Storm) వస్తున్నాయని గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో రోడ్లపై నిలిపి ఉంచిన కార్లు కొట్టుకుపోయాయి. ఇక్కడ చాలా ఇళ్ల గ్రౌండ్‌ ఫ్లోర్లలోకి నీరు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గురువారం నుంచి తీర ప్రాంతాల్లో చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉందని సమాచారం. ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని ప్రభుత్వం వార్నింగ్ జారీ చేసింది. హెర్మోస, మాన్‌హట్టన్‌, పాలోస్‌ వెర్డోస్‌ బీచ్‌లలోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. కాలిఫోర్నియా తీరప్రాంతంలో తుఫాను ప్రభావంతో భారీగా అలలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా, ఓరెగాన్‌ తీర ప్రాంతాల్లోని దాదాపు 60 లక్షల మంది ఈ అలల ప్రభావాన్ని చవి చూస్తున్నారు.

Also Read: Modi – Natu Natu : ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌పై మోడీ ‘మన్ కీ బాత్’ ఇదీ..