World Leader : అగ్రరాజ్యంగా మేం కాకుంటే ఇంకెవరు ఉంటారు ? : బైడెన్

World Leader : ఒకప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యం బ్రిటన్.. ఇప్పుడు  ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా!!

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 11:41 AM IST

World Leader : ఒకప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యం బ్రిటన్.. ఇప్పుడు  ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా!! ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారం వేళ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అగ్రరాజ్యంగా.. ప్రపంచ అధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదంటూ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను బైడెన్‌ ఖండించారు. ప్రపంచ పెద్దన్నగా(World Leader) అమెరికా లేకపోతే మరెవరు ఈ ప్రపంచానికి నాయకత్వం వహిస్తారని ఆయన ట్రంప్‌ను ప్రశ్నించారు.ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ ఎన్నికల్లో తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ పేర్కొన్నారు.  ‘‘జీ7, జీ20 కూటములలోని దేశాధినేతలు కూడా మీరే గెలవాలని నాతో చెబుతున్నారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఇప్పుడు  యావత్‌ ప్రపంచం చూపు అమెరికావైపే ఉంది. ఎవరు గెలుస్తారనే దాని కంటే ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయి. అనే దాన్నే అందరూ గమనిస్తున్నారు’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు తమ  డెమొక్రటిక్ పార్టీకి రూ.4వేల కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని ఆయన వెల్లడించారు.  వీటిని 16 లక్షల మంది దాతలు అందించారని చెప్పారు. వీరిలో 97 శాతం మంది ఒక్కొక్కరు సగటు రూ.17వేల కంటే తక్కువే ఇచ్చారని బైడెన్ వివరించారు. ‘‘ఈ ఎన్నికల్లో గెలిచేది నేనే. చాలా సర్వేల్లోనూ ఇదే విధంగా నివేదికలు వచ్చాయి. ఇప్పటి వరకు వెలువడిన 23 జాతీయ స్థాయి పోల్స్‌లో దాదాపు 10 నాకు అనుకూలంగా ఫలితాలను ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్‌ 8 ఎనిమిది సర్వేలలోనే నెగ్గారు. ఐదు సర్వేలలో సరిసమానంగా ఫలితం వచ్చింది’’ అని బైడెన్ వివరించారు.

Also Read : Summer Vs Mosquitoes : వేసవి టైంలో దోమల బెడద.. తగ్గించుకునే చిట్కాలివీ

అమెరికా అధ్యక్ష బరిలో మరో ముగ్గురు

  • ప్రముఖ రచయిత్రి మరియాన్నే విలియమ్సన్ (71) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.
  • వ్యాక్సిన్ వ్యతిరేక కార్యకర్త, పర్యావరణ న్యాయవాది అయిన రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ (70) తొలుత డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ కోసం జో బైడెన్‌తో పోటీపడి తర్వాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.
  • రాజకీయ కార్యకర్త, తత్వవేత్త, విద్యావేత్త అయిన కార్నెల్ వెస్ట్ అధ్యక్ష అభ్యర్ధిగా థర్డ్ పార్టీ బిడ్ సమర్పించారు. పేదరికాన్ని అంతమొందిస్తానని కార్నెల్ హామీ ఇచ్చారు.

Also Read :Gold- Silver Prices: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు