అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహానికి ఆమోదం లభించింది. అమెరికా పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన గే మ్యారేజ్ ప్రొటెక్షన్ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్( President Biden) మంగళవారం సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు ప్రభుత్వ గుర్తింపునిచ్చే చట్టాన్ని ఆమోదిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ (President Biden) మంగళవారం సంతకం చేశారు. దేశంలో స్వలింగ వివాహాలకు సమాఖ్య రక్షణ కల్పించేందుకు బైడన్ అంగీకరించారు.
ఈ సందర్భంగా ‘‘దేశంలో కొందరికే కాదు ప్రతిఒక్కరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం అమెరికా కీలక అడుగు ముందుకేసింది. దేశంలోని లక్షలాది స్వలింగ, జాతీయేతర జంటలను మేము గౌరవిస్తాం’’ అని బైడెన్ అన్నారు. ఈ కొత్త US చట్టం స్వలింగ వివాహాలకు సమాఖ్య రక్షణను ఇస్తుంది. ఈ చట్టం అన్ని US రాష్ట్రాల్లో స్వలింగ వివాహ జంటల హక్కులను గుర్తించి, సంరక్షిస్తుంది.
అమెరికా హౌస్ నుంచి ఈ బిల్లును ఆమోదించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ ఈరోజు ఒక ముఖ్యమైన అడుగు వేసిందని ఆయన అన్నారు. అమెరికన్లు తాము ఇష్టపడే వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉందని నిర్ధారించడానికి కాంగ్రెస్ ఈ రోజు ఒక ముఖ్యమైన చర్య తీసుకుందని బైడెన్ చెప్పారు. గత వారం ఈ బిల్లు US సెనేట్ నుండి ఆమోదించబడింది. బిల్లుకు మద్దతుగా 61 ఓట్లు రాగా, 36 మంది వ్యతిరేకించారు.
Also Read: FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో ఫైనల్ కు చేరిన అర్జెంటీనా..!
ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల లక్షలాది మంది LGBTQI, కులాంతర జంటలకు మనశ్శాంతి లభిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు వారికి, వారి పిల్లలకు హక్కులు, రక్షణ హామీ ఇవ్వబడ్డాయి. ఈ బిల్లుకు చట్టపరమైన గుర్తింపు వచ్చిన తర్వాత 2015 తీర్పు తర్వాత వివాహం చేసుకున్న వేలాది స్వలింగ జంటలకు ఉపశమనం లభిస్తుంది. యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి డిగ్నిటీ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్‌కు తన మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. ప్రతి అమెరికన్ గౌరవం, సమానత్వాన్ని కాపాడేందుకు డెమొక్రాట్ల పోరాటంలో ఇది చారిత్రాత్మక అడుగు అని ఆయన అన్నారు. ఈ చట్టం మితవాద తీవ్రవాదులు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.