Woman To Lead US Navy : అమెరికా నౌకాదళానికి తొలిసారిగా ఒక మహిళ నాయకత్వం వహించబోతున్నారు..
అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టిని అమెరికా నేవీ చీఫ్ గా నామినేట్ చేస్తానని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
“ఈ నియామకం జరిగితే అమెరికా నావల్ ఆపరేషన్స్ చీఫ్‌గా, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో పనిచేసిన మొదటి మహిళగా లిసా ఫ్రాంచెట్టి చరిత్ర సృష్టిస్తారు” అని అమెరికా ప్రెసిడెంట్ వెల్లడించారు.
Also read : National Mango Day: మనం తినే మామిడి పండుకి ఇంత హిస్టరీ ఉందా..?
ప్రస్తుతం అమెరికా నేవీ అధిపతిగా ఉన్న అడ్మిరల్ మైక్ గిల్డే పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. ఆయన పదవీ విరమణ చేసిన వెంటనే లిసా ఫ్రాంచెట్టి ఆ బాధ్యతలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. అమెరికా నేవీలో ఇప్పటివరకు అడ్మిరల్ ర్యాంక్ సాధించిన రెండో మహిళ లిసా ఫ్రాంచెట్టి(Woman To Lead US Navy) మాత్రమే. 38 ఏళ్లుగా నేవీలో పనిచేస్తున్న లిసా ఫ్రాంచెట్టి వయసు 59 ఏళ్ళు. ఆమె ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ హోదాలో పనిచేస్తున్నారు. ఫ్రాంచెట్టి ఎన్నో యుద్ధ నౌకలతో పాటు గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్స్, డెస్ట్రాయర్స్ స్క్వాడ్రన్లు, రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులకు గతంలో నేతృత్వం వహించారు. యూరప్, ఆఫ్రికాలో అమెరికా నేవీ దళాలకు డిప్యూటీ కమాండర్‌గానూ సేవలు అందించారు. నౌకాదళాల యుద్ధ పోరాట నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన విభాగానికి కూడా డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు. 2022 సెప్టెంబర్ లో లిసా ఫ్రాంచెట్టికి నౌకాదళ కార్యకలాపాల వైస్ చీఫ్ పదవి దక్కింది.
Also read : North Korea Vs South Korea : మిస్సైళ్లతో విరుచుకుపడిన ఉత్తర కొరియా.. దక్షిణ కొరియా వార్నింగ్