Site icon HashtagU Telugu

Biden Birthday : బైడెన్ బర్త్ డే వేడుకలో టర్కీ కోడి.. ఎందుకు ?

Biden Birthday

Biden Birthday

Biden Birthday : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన 81వ పుట్టినరోజును సోమవారం మధ్యాహ్నం వైట్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయన కొవ్వొత్తులతో వెలుగులు విరజిమ్ముతున్న పెద్ద కేకును కట్ చేశారు. ఆ కేక్‌ను కట్ చేసే ముందు దిగిన ఒక ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దానితో పాటు ఒక మెసేజ్‌ను కూడా పెట్టారు. ఈ ఫొటోపై నెటిజన్స్ పెద్దఎత్తున రియాక్ట్ అయ్యారు. ‘‘మీ కేకులోని కొవ్వొత్తుల మధ్య గ్యాప్ ఇంకా పెంచి ఉండాల్సింది’’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ‘‘అమెరికా సీక్రెట్ సర్వీసుకు ఫైర్ డివిజన్ కూడా ఉందా’’ అని మరో నెటిజన్ బైడెన్‌ను ప్రశ్నించాడు.

 

We’re now on WhatsApp. Click to Join.

దాదాపు 100 ఏళ్లుగా అమెరికాలో ‘థ్యాంక్స్ గివింగ్ డే’ సంప్రదాయం కొనసాగుతోంది. ఏటా నవంబరు నెలలో వచ్చే నాలుగో గురువారం రోజున ‘థ్యాంక్స్ గివింగ్ డే’ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి నవంబరు 23న ‘థ్యాంక్స్ గివింగ్ డే’ వస్తోంది.  ప్రెసిడెంట్ బైడెన్ తన బర్త్ డే సందర్భంగా వైట్ హౌస్‌లో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈక్రమంలో ‘థ్యాంక్స్ గివింగ్ డే’ను పురస్కరించుకొని ఒక టర్కీ కోడిని బైడెన్‌కు నేషనల్ టర్కీ ఫెడరేషన్ చైర్మన్ బహుమతిగా అందించారు. దాన్ని స్వీకరించిన బైడెన్.. ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. తాను ఇంకా 60 ఏళ్లలోనే ఉన్నట్టుగా అనిపిస్తోందని చమత్కరించారు. ‘‘60 ఏళ్లు దాటడం చాలా కష్టమని మీరు తెలుసుకోవాలి’’ అని కామెంట్ చేశారు.

Also Read: Limp Mode : కారు ‘లింప్ మోడ్’‌లోకి ఎందుకు వెళ్తుంది ?

అమెరికా చరిత్రలో అతిపెద్ద వయస్కుడైన అధ్యక్షుడు బైడెన్ మాత్రమే. ఆయన వయసును టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం.. బైడెన్ వయసును ప్రస్తావిస్తూ హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. బైడెన్ మాత్రం తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. వయసు మీద పడినా విధి నిర్వహణలో ఆయన(Biden Birthday) పక్కాగా వ్యవహరిస్తుండటం స్ఫూర్తిదాయకం.