Bethlehem : క్రిస్మస్ వేళ.. బోసిపోయిన క్రీస్తు జన్మస్థలం

Bethlehem : క్రీస్తు జన్మస్థలం బెత్లెహం. ఈ నగరం పాలస్తీనా దేశంలో ఉంది. అయితే ప్రస్తుతం బెత్లెహం నగరం ఇజ్రాయెల్ ఆర్మీ కబ్జాలో ఉంది.

  • Written By:
  • Updated On - December 25, 2023 / 02:50 PM IST

Bethlehem : క్రీస్తు జన్మస్థలం బెత్లెహం. ఈ నగరం పాలస్తీనా దేశంలో ఉంది. అయితే ప్రస్తుతం బెత్లెహం నగరం ఇజ్రాయెల్ ఆర్మీ కబ్జాలో ఉంది. అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు దాదాపు గత 80 రోజులుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 20వేల మంది అమాయక పాలస్తీనా ప్రజలు చనిపోయారు. వీరిలో ఎంతోమంది క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎన్నో పురాతన చర్చిలపైనా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేసి కూల్చేసింది. ఈ ఘటనలను అంతర్జాతీయ క్రైస్తవ సమాజం ఖండించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించింది.

We’re now on WhatsApp. Click to Join.

క్రీస్తు జన్మస్థలం బెత్లెహం(Bethlehem) పరిసరాల్లో కూడా పాలస్తీనా పౌరులు, ఇజ్రాయెల్ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతోంది. యుద్ధం కారణంగా ఆ ప్రాంతంలోని క్రైస్తవుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక అవస్థల్లో ఉన్నాయి.ఈ ఇబ్బందుల నడుమే దయనీయ స్థితిలో ఇవాళ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా విదేశీ యాత్రికులు బెత్లెహంకు వచ్చేవారు. ఇప్పుడు యుద్ధం కారణంగా పర్యాటకులు, యాత్రికులు రాలేదు. దీంతో ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లకు గిరాకీ లేకుండా పోయింది. యుద్ధం నేపథ్యంలో ఇవాళ క్రిస్మస్ సందర్భంగా బెత్లెహం నగరంలో పండుగ సందడి లేకుండాపోయిందని స్థానిక క్రైస్తవులు తెలిపారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా యాత్రికులు పెద్దసంఖ్యలో బెత్లెహంకు రావడంతో హోటళ్ల నిర్వాహకులకు మంచి గిరాకీ ఉండేది.  భోజనాలు పెద్దఎత్తున సేల్ అయ్యేవి. భోజనాల తయారీకి ఆర్డర్స్ కూడా వచ్చేవి.  ఇప్పుడు హోటల్స్ అన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా హోటళ్ల నిర్వాహకులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.

Also Read: CM Revanth : సీఎం రేవంత్‌కు స్వల్ప జ్వరం.. కరోనా టెస్టు చేసిన డాక్టర్లు

పోప్ ఫ్రాన్సిస్  ప్రపంచ దేశాలకు శాంతి సందేశమిస్తూ వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చిలో  క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. యేసు క్రీస్తు పవిత్ర జన్మభూమిలో యుద్ధంతో రక్తం పారుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ గత 80 రోజులుగా దాడులు చేస్తుండటం బాధాకరమన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ గురించి ఆలోచిస్తే  చాలా ఆందోళనగా ఉందని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఈ యుద్ధంతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని చెప్పారు. ‘‘ఇప్పుడు నా మనసంతా పాలస్తీనాలోని బెత్లెహెమ్‌లో ఉంది. ఆ శాంతి భూమిలో యుద్ధం చేయడం సరికాదు. సాయుధ సంఘర్షణతో ప్రపంచం ఏమీ సాధించలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. శాంతి, ప్రేమలే ప్రపంచాన్ని, మానవాళిని ఏకం చేయగలవని పోప్  ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు.