Shakib Al Hasan : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అధికార పార్టీ బంగ్లాదేశ్ అవామీ లీగ్ (BAL)లో షకీబ్ చేరారు. వచ్చే ఏడాది జనవరి 7న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బంగ్లాదేశ్ అవామీ లీగ్ లీగ్ తరఫున పోటీ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. షకీబ్ తాను పోటీ చేసేందుకుు మూడు లోక్‌సభ నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారని, వాటిలో ఏదో ఒకదాన్ని పార్టీ ఖరారు చేస్తుందని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ జాయింట్ సెక్రటరీ జనరల్ బహౌద్దీన్ నసీమ్ వెల్లడించారు. షకీబ్ అభ్యర్థిత్వాన్ని ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అధికార పార్టీ పార్లమెంటరీ బోర్డు ధృవీకరించాల్సి ఉందన్నారు. ఆ వెంటనే ఆయనకు బీఫామ్‌ను జారీ చేస్తామని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
బంగ్లాదేశ్ నైరుతి ప్రాంతంలోని తన సొంత జిల్లా మగురా నుంచి లేదా రాజధాని ఢాకా పరిధిలోని ఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని షకీబ్ భావిస్తున్నారని నసీమ్ వివరించారు. అయితే ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలను బంగ్లాదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించబోతున్నాయి. హసీనా గత 15 సంవత్సరాలుగా దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్షాల ఎన్నికల బహిష్కరణ ఈసారి కూడా కొనసాగితే హసీనా నాలుగోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజా కూడా 2018లో రాజకీయాల్లో చేరారు. అదే ఏడాది అధికార పార్టీ నుంచి శాసనసభ్యుడిగా(Shakib Al Hasan) ఎన్నికయ్యారు.