Site icon HashtagU Telugu

Bangladesh : బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ.. వందలాదిగా తిరిగొస్తున్న భారత విద్యార్థులు

Bangladesh Curfew

Bangladesh :  బంగ్లాదేశ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఈమేరకు కీలక ఆదేశాలను గురువారం అర్ధరాత్రి జారీ చేసింది. బంగ్లాదేశ్‌ విముక్తి  ఉద్యమంలో పాల్గొన్నవారి వారసులకు గతంలో ఉన్న 30శాతం రిజర్వేషన్లను ఆ దేశ హైకోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో జరుగుతున్న  నిరసనలు తీవ్రరూపు దాల్చాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ(Bangladesh Curfew) విధించింది. మూడు వారాలుగా దేశంలో అశాంతి నెలకొన్నందున శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. శుక్రవారం రోజు నార్సింగ్డి జిల్లాలోని ఓ జైలుకు నిరసనకారులు నిప్పు పెట్టడంతో వందలాది మంది ఖైదీలు పారిపోయారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలోనే కర్ఫ్యూ విధించాలనే నిర్ణయానికి బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

రిజర్వేషన్లను వ్యతిరేకించే నిరసనకారులు, ప్రభుత్వ అనుకూల కార్యకర్తల మధ్య జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 105  మందికిపైగా మృతి చెందారని తెలుస్తోంది. వీరిలో దాదాపు 50 మంది దేశ రాజధాని ఢాకాలోనే చనిపోయారు. ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఢాకా, రాజ్‌షాహీ, ఖుల్నా, చత్తోగ్రాంలలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థులు వెనక్కి వస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 300కిపైగా భారత విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి స్వదేశానికి వచ్చేశారు. అల్లర్లు జరుగుతున్నందున దేశంలోని విశ్వవిద్యాలయాలను మూసివేయాలని గత మంగళవారమే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గత గురువారం నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.

Also Read :Mobile Phone: బాత్‌రూమ్‌లో ఫోన్ వాడుతున్నారా…? అయితే ఈ వార్త ఖ‌చ్చితంగా చ‌ద‌వాల్సిందే..!

మన దేశానికి చెందిన ఎంతోమంది విద్యార్థులు బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, హర్యానా, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారే కావడం గమనార్హం. బంగ్లాదేశ్ నుంచి భారత విద్యార్థులు స్వదేశానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.  త్రిపురలోని అగర్తల సమీపంలో ఉన్న అఖురాహ్ వద్దనున్న అంతర్జాతీయ ల్యాండ్ పోర్ట్, మేఘాలయలోని దావ్కీ వద్ద ఉన్న అంతర్జాతీయ ల్యాండ్ పోర్ట్. ప్రధానంగా ఈ రెండు మార్గాల నుంచే రాకపోకలు జరుగుతుంటాయి.

Also Read :Gautam Adani: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న అదానీ.. ఆ జ‌ట్టుపై క‌న్ను..!