Site icon HashtagU Telugu

Baby Born With Tail: బ్రెజిల్‌లో వింత ఘటన.. తోకతో జన్మించిన శిశువు..!

Tail

Resizeimagesize (1280 X 720) 11zon

బ్రెజిల్‌లో వింత ఘటన వెలుగు చూసింది. ఓ నవజాత శిశువు 6సెంటీమీటర్ల తోకతో (Baby Born With Tail) జన్మించింది. దీనిని గమనించిన డాక్టర్లు వెంటనే శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. కాగా శిశువు స్పైనాబిఫిడా అనే అరుదైన పరిస్థితితో జన్మించిందని, ఇది శిశువు వెన్నుపాము సాధారణంగా అభివృద్ధి చెందడంలో విఫలమైనప్పుడు జరుగుతుందని వైద్యులు తెలిపారు. దీనివల్ల శిశువు వెన్నుపాము అభివృద్ధిలో గ్యాప్ ఏర్పడి తోక పెరిగిందని చెప్పుకొచ్చారు.

Also Read: Virat Kohli Not Out: ఇదేమి అంపైరింగ్.. కోహ్లీ ఔట్‌పై ఫ్యాన్స్ ఫైర్

బ్రెజిల్‌లో జన్మించిన ఓ పసికందు వీపుపై ఆరు సెంటీమీటర్ల తోక ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు.సావో పాలోలోని పిల్లల ఆసుపత్రి అయిన గ్రెండాక్ వైద్యులు మాట్లాడుతూ.. తోక వెన్నెముకను పెల్విస్‌తో కలిపే ప్రాంతమైన లంబోసాక్రల్ ప్రాంతం నుండి ఉద్భవించిందని చెప్పారు. వైద్యులు దీనిని “హ్యూమన్ సూడో-టెయిల్”గా నిర్ధారించారు. ఇది తోకను పోలి ఉంటుంది. అయితే ఇది వెన్నెముక సమస్యలు లేదా కణితుల కారణంగా ఏర్పడుతుంది. వైకల్యం తోక భిన్నంగా ఉంది. ఇందులో కండరాలు, రక్తనాళాలు, నరాలు ఉంటాయి. కానీ ఎముకలు లేవు. ఒహియోలోని సెంటర్ ఫర్ ఫెటల్ అండ్ ప్లాసెంటల్ రీసెర్చ్ పరిశోధకులు బ్రెజిలియన్ వైద్యులతో కలిసి ఈ కేసును అధ్యయనం చేశారు.