India-US Drone Deal: భారతదేశం మరియు అమెరికా మధ్య డ్రోన్ ఒప్పందంపై ప్రతిపక్ష పార్టీ ‘కాంగ్రెస్’ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ మేరకు డ్రోన్ కొనుగోలు ఒప్పందంలో పూర్తి పారదర్శకతను కోరింది. ఒప్పందంలో లొసుగులున్నాయని అనుమానం వ్యక్తం చేసింది. అందుకే భారీగా ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. అమెరికాతో డ్రోన్ల ఒప్పందం మరో రఫేల్ అవుతుందా అంటూ ఘాటుగా విమర్శించింది.
అమెరికా నుంచి కొనుగోలు చేసిన డ్రోన్స్ ఇతర దేశాల ధర కంటే 27 శాతం తక్కువకు భారత్ కు అందించినట్టు సంబంధిత అధికారి తెలిపారు. ఎంక్యూ-9బీ ప్రిడేటర్ యూఏవీ డ్రోన్‌లను భారత్ కొనుగోలు చేసింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ భద్రతే ప్రధానమని, ప్రిడేటర్ డ్రోన్ డీల్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ ప్రిడేటర్ డ్రోన్ డీల్‌లో పూర్తి పారదర్శకతను కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇందులో భారీ స్కామ్ జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమాచారం ప్రకారం ఒక్కో డ్రోన్ అంచనా వ్యయం US$99 మిలియన్లు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ధర ఒక్కో డ్రోన్‌కు US$ 161 మిలియన్లు.
Read More: Chocolate Brownies: బ్రౌని చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?