Australia PM: ఆస్ట్రేలియా ప్రధానికి రెండోసారి కరోనా

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనెసే రెండోసారి కరోనా బారినపడ్డారు.

  • Written By:
  • Publish Date - December 6, 2022 / 07:05 AM IST

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనెసే రెండోసారి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హామ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ మరోసారి కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ప్రధానమంత్రి అల్బనీస్ సోమవారం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఆయన ట్విట్టర్ లో ఇలా రాశారు. ‘ఈరోజు మ‌ధ్యాహ్నం మామూలుగా పీసీఆర్ ప‌రీక్ష చేయించుకున్నా. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఐసోలేష‌న్‌లో ఉంటున్నా. ఇంటి నుంచే ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు చూస్తాను’ అని ఆంటోని రాసుకొచ్చారు. ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డం ఇది రెండోసారి. అంతేకాదు దేశ‌ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అనారోగ్య ల‌క్ష‌ణాలు ఉన్న‌వాళ్లు క‌రోనా టెస్ట్ చేసుకోండి. క‌రోనా బారిన ప‌డ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోండని ఆంటోని దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు.

డిసెంబ‌ర్ 12-13 తేదీల్లో ఆయ‌న ప‌పువా న్యూ గినియాకు రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల్సి ఉంది. ఇటీవలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో కనీసం 90 శాతం మంది ఇప్పుడు SARS-COV-2కి ముందస్తు ఇన్ఫెక్షన్ లేదా టీకా కారణంగా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారు. వాస్తవానికి.. గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. గత ఐదు వారాలలో WHOకి నివేదించబడిన వారపు మరణాల సంఖ్య కొద్దిగా తగ్గిందని తెలిపారు