Site icon HashtagU Telugu

Hamburg Shooting: జర్మనీలో కాల్పులు కలకలం.. ఏడుగురు మృతి

Shooting In Philadelphia

Open Fire

జర్మనీలోని హాంబర్గ్ (Hamburg) నగరంలో కాల్పుల (Shooting) ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అల్స్టర్‌డార్ఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని హాంబర్గ్ పోలీసులు ట్వీట్‌లో తెలిపారు. దాడికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని హాంబర్గ్ పోలీసులు ట్వీట్ చేశారు. మీడియా కథనాల ప్రకారం.. డీల్‌బోగ్ స్ట్రీట్‌లోని చర్చిలో కాల్పులు జరిగాయి.

గురువారం (మార్చి 9) రాత్రి 9:15 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు జర్మనీ పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గ్రాస్ బోర్‌స్టెల్ జిల్లాలోని డెల్బోగ్ స్ట్రీట్‌లోని చర్చిలో కాల్పులు జరిగాయని పోలీసులు ట్వీట్ చేశారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.

Also Read: Taliban Governor: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. తాలిబన్ గవర్నర్ మృతి

ఆ ప్రాంతంలోని తీవ్ర ప్రమాదం గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వారు విపత్తు హెచ్చరిక యాప్‌ను ఉపయోగించారు.చాలా రోడ్లు మూసుకుపోయాయని, ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలంటూ ప్రజలకు సందేశాలు పంపుతున్నట్లు జర్మన్ పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. నెట్‌వర్క్‌పై భారం పడకుండా ఉండేందుకు స్థానిక నివాసితులు ఇంటి లోపలే ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్‌లను ఉపయోగించాలని కోరారు. అదే సమయంలో ఈ దాడి వెనుక ఉద్దేశ్యంపై పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ నేరం వెనుక ఉద్దేశ్యం గురించి ఇప్పటివరకు విశ్వసనీయ సమాచారం అందలేదు అని తెలిపారు. హాంబర్గ్ మేయర్ పీటర్ ష్నిట్జర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పోలీసులు నేరస్తులను కనిపెట్టడానికి వేగంగా కృషి చేస్తున్నారు అని తెలిపారు.

జర్మనీలో ఇటీవలి సంవత్సరాలలో జిహాదీలు, తీవ్రవాదులచే అనేక దాడులు జరిగాయి. డిసెంబర్ 2016లో బెర్లిన్ క్రిస్మస్ మార్కెట్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన అత్యంత ఘోరమైన ట్రక్కు విధ్వంసంలో 12 మంది మరణించారు. అదే సమయంలో కొద్దిరోజుల క్రితం ట్యునీషియాలో దాడి జరిగింది. ఫిబ్రవరి 2020లో మధ్య జర్మన్ నగరమైన హనౌలో మితవాద తీవ్రవాది 10 మందిని కాల్చి చంపాడు. ఐదుగురు గాయపడ్డారు. 2019లో యోమ్ కిప్పూర్ యూదుల సెలవుదినం సందర్భంగా ఒక నియో-నాజీ హాలీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అతను కాల్పులు జరిపాడు. దాని కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.