Site icon HashtagU Telugu

Earthquake: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి

Philippines

Earthquake 1 1120576 1655962963

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూకంపం (earthquake) కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా 11 మంది గాయపడినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం (earthquake) కారణంగా రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంపం చాలా బలంగా ఉంది. ఇప్పుడు వేలాది మంది ప్రజలు కరెంటు లేకుండా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. హంబోల్ట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భూకంపం వల్ల 11 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు.

ఈ భూకంపం వల్ల దాదాపు 80 ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలు వచ్చిన ప్రాంతం రెడ్‌వుడ్ అడవులు, స్థానిక మత్స్య, కలప పరిశ్రమ, పాడి పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే తాజా భూకంపం ఇటీవలి కాలంలో వచ్చిన దానికంటే అధికంగా ఉంది.

Also Read: Imran Khan: మహిళతో ఇమ్రాన్ ఖాన్ శృంగార సంభాషణ లీక్.. వివరణ ఇచ్చిన పార్టీ

శాన్ ఫ్రాన్సిస్కోకు వాయువ్యంగా 343 కి.మీ దూరంలో ఫెర్న్‌డేల్ సమీపంలో తెల్లవారుజామున 2.34 గంటలకు 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం తీరానికి సమీపంలో 10 మైళ్ల లోతులో ఉంది. దీని తర్వాత అనేక ప్రకంపనలు సంభవించాయి. దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తున్న Poweroutages.com, భూకంపం తర్వాత 55,000 మందికి పైగా వినియోగదారులు విద్యుత్తు అంతరాయం గురించి ఫిర్యాదు చేసినట్లు నివేదించింది. చాలా చోట్ల గ్యాస్ లీకేజీపై ఫిర్యాదులు కూడా అందాయి. సునామీ వస్తుందని ఊహించలేదని హంబోల్ట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ట్వీట్ చేసింది.