19 Dead : చిలీలోని అడవులను కార్చిచ్చు దహిస్తోంది. ఈ కార్చిచ్చు ధాటికి అడవుల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాల్లో ఉన్న వందలాది ఇళ్లు, వాహనాలు దగ్ధమవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇప్పటివరకు ఈ కార్చిచ్చు వల్ల 19 మంది చనిపోయారని(19 Dead) చిలీ కేంద్ర హోంమంత్రి కరోలినా తోహా వెల్లడించారు. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కార్చిచ్చు కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు ఒక లక్ష ఎకరాల్లో అడవులు కాలి బూడిదయ్యాయని కరోలినా తోహా వివరించారు. దేశంలోని దాదాపు 92 చోట్ల అడవుల్లో ఇంకా కార్చిచ్చు యాక్టివ్‌గానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాల్‌పరైసో అనే ప్రాంతంలో దాదాపు 7వేల హెక్టార్ల మేర అడవులు కాలిపోయాయని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
ఈనేపథ్యంలో చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తమ దేశ ప్రజల సహాయార్ధం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ వర్క్స్ చేపట్టాలని పిలుపునిచ్చారు. చిలీ రాజధాని శాంటియాగోకు నైరుతి దిశలో ఉన్న ఎస్ట్రెల్లా, నవిడాడ్ పట్టణాల సమీపంలోని అడవుల్లో కార్చిచ్చు ధాటికి దాదాపు 30 ఇళ్లు కాలిపోయాయి. అడవుల పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ఇళ్లను ఖాళీచేసి.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాలలో తల దాచుకుంటున్నారు. ఈ కార్చిచ్చు కారణంగా చిలీ దేశంలోని రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. చాలా అటవీ మార్గాల్లోని అడవులు మంటల వలయంలో చిక్కుకొని ఉండటంతో వాటి మీదుగా భూతల రాకపోకలు కష్టతరంగా మారాయి. కరువు పరిస్థితులు, ఎల్ నినో తరహా వాతావరణ మార్పులు, వడగాలుల కారణంగా ఈ విధంగా చిలీ అడవులను కార్చిచ్చు ఆవహించిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కొలంబియా, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్‌లపై కూడా ఈవిధమైన నెగటివ్ ఎఫెక్ట్ కనిపించే రిస్క్ ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read : Maldives Vs India : ఇండియాను వివరణ కోరిన మాల్దీవ్స్.. ఎందుకో తెలుసా ?
‘బంగారం’ కలిగి ఉన్న కొండలు
‘బంగారం’ కలిగి ఉన్న కొండలను మీరెప్పుడైనా చూశారా? అలాంటివి నైరుతి చైనాలోని సిచువాన్‌లో ఉన్నాయి. సిచువాన్‌లోని గోంగాషన్ అనే అందమైన పర్వత సమూహం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే.. ఇది 90 శాతం బంగారు వర్ణంలో ఉంటుంది. సూర్యకాంతి పడినప్పుడు ఈ మంచు కొండ మొత్తం గోల్డెన్ కలర్‌ను సంతరించుకుంటుంది. కాబట్టి దీనిని బంగారు పర్వతంగా పిలుస్తారు. 7556-మీటర్ల వరకు విస్తరించి ఈ పర్వతంపై ప్రవహించే నీరు కూడా ద్రవరూపంలోని బంగారాన్ని తలపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ 5000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో ఉన్న అనేక పెద్ద పర్వతాలు, హిమానీనదాలు, ఆదిమ అడవులు, అందమైన ఆల్పైన్ లోయలు కనువిందు చేస్తుంటాయి. ఒకప్పుడు టిబెటన్ సంచార జాతులు చైనాలోని టాప్ 10 హైకింగ్ గమ్యస్థానాలలో ఒకటైన గోంగాషన్ పరిసరాలకు తరచుగా వలసవెళ్లేవారు. ఇది కాంగ్డింగ్ పట్టణానికి సమీపంలో చెంగ్డుకు పశ్చిమాన 300కిమీ దూరంలో ఉంది.