Site icon HashtagU Telugu

Pak Army cheif : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా అసీమ్ మునీర్ నియామకం..!!

Pak Army Cheif

Pak Army Cheif

పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. జనరల్ కమర్ జావేద్ బజ్వా స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమితులైనట్లు పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ప్రధాని షెహబాస్ షరీష్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అసీమ్ మునీర్ తోపాటు అయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ గా లెఫ్టినెంట్ జనరల్ సాహిల్ షంసాద్ మీర్జాను నియమించారని సమాచార మంత్రి మర్యమ్ ఔరంగజేబ్ చెప్పారు. అసీమ్ మునీర్ గతంలో ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

నియామకాలను పరిగణనలోకి తీసుకునేందుకు ప్రధాని ఫెడరల్ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు జియో న్యూస్ నివేదించింది. సైన్యంలోని కీలక స్థానాలకు అధికారులను ఎంపిక చేసుకునేందుకు మిత్రపక్షాలు వారికి అధికారం ఇచ్చాయి. ఎంపికైన ఈ ఇద్దరు సీనియర్ మోస్ట్ మిలటరీ అధికారులు. పిటిఐకి చెందిన పత్రాలను రాష్ట్రపతికి పంపినప్పటికీ, కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఇప్పటికే ఆయన తన పార్టీకి విధేయత చూపాలని, దేశ ప్రయోజనాల కోసం పని చేయాలని హెచ్చరించాయి.

ఫెడరల్ క్యాబినెట్ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా పత్రాలను రాష్ట్రపతికి పంపినట్లు ధృవీకరించారు. పాక్ రాజ్యాంగం ప్రకారం అన్ని విషయాలు సెటిల్ అయ్యాయని, రాష్ట్రపతి ఎలాంటి వివాదాలు సృష్టించరని భావిస్తున్నామని ఆసిఫ్ అన్నారు. ప్రధాని సలహాను అధ్యక్షుడు అల్వీ పాటిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నియామకాలను రాజకీయంగా చూడకూడదని కూడా ఆయన ఆకాంక్షించారు. ఈ విషయంపై అధ్యక్షుడు అల్వీతో PTI చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సంప్రదింపులపై వ్యాఖ్యానించడానికి మంత్రి నిరాకరించారు. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలను వివాదాస్పదం చేయవద్దని అన్నారు. దీనికి సంబంధించి సవివరమైన పత్రికా ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆసిఫ్ తెలిపారు.