Site icon HashtagU Telugu

Yahya Sinwar : యహ్యా సిన్వార్‌ చనిపోయాడా ? ఇజ్రాయెల్ వాదన ఏమిటి ?

Yahya Sinwar Video

Yahya Sinwar : ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ ప్రత్యేక ఫోకస్ ఒక వ్యక్తిపై ఉంది. అతడి పేరే.. యహ్యా సిన్వార్‌. గత సంవత్సరం అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు గాజా ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లకు కమాండ్స్ ఇస్తూ నడిపిస్తున్నది అతడే. ఇజ్రాయెల్ ఆర్మీపై దాడులు చేయిస్తున్నది సిన్వారే.  గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడులకు పథక రచన చేసింది ఇతడే అని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో సిన్వార్ (Yahya Sinwar) ఇప్పటికే చనిపోయి ఉంటాడని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది.సుదీర్ఘకాలంగా అతడి కదలికలు లేకపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుకుంటున్నారు. అయితే యహ్యా సిన్వార్ చావును బలపర్చే ఆధారాలేవీ ఇంకా లభించలేదు.

Also Read :Tirupati Laddu Row : తిరుమల లడ్డూల వివాదం.. తమిళనాడు కంపెనీకి షోకాజ్‌ నోటీసులు..!

ఇజ్రాయెల్ మీడియాలో మాత్రం అతడు చనిపోయి ఉంటాడని పేర్కొంటూ కథనాలు వస్తున్నాయి. ఒకవేళ సిన్వార్‌ చనిపోయినా, ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆగస్టు మొదటివారంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మర్డర్ జరిగింది. దీంతో తమ నేతగా సిన్వార్‌ను హమాస్ మిలిటెంట్లు ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు అతడు కూడా పత్తా లేకుండా పోయాడు. దీంతో హమాస్‌కు నాయకత్వం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది.  ఇప్పటివరకు గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో దాదాపు 41 మందికిపైగా పాలస్తీనా ప్రజలు చనిపోయారు. ఉండటానికి ఇల్లు లేక.. తినడానికి తిండి లేక దయనీయ స్థితిలో గాజా ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు.

Also Read :R. Krishnaiah : వైసీపీ కి కృష్ణయ్య షాక్ ఇవ్వబోతున్నారా..?

తొలిసారిగా ఇటీవలే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాలస్తీనాకు కూడా ఒక సీటును కేటాయించారు. దీన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా ప్రపంచంలోని అత్యధిక దేశాలు పాలస్తీనాకు మద్దతుగా నిలబడ్డాయి. దీంతో ఇజ్రాయెల్‌కు షాక్ తగిలినట్లయింది. తాజాగా ఇవాళ ఉదయం అమెరికాలోని న్యూయార్క్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ అయ్యారు. గాజా ప్రజలు ఎదుర్కొంటున్న దయనీయ స్థితిగతులపై ఈసందర్భంగా  మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.