Site icon HashtagU Telugu

US Army: అమెరికాలో దారుణం.. యజమాని పైనే తిరగబడిన డ్రోన్.. చివరికి?

Us Army

Us Army

సూపర్ స్టార్ రజినీకాంత్ తెరకెక్కించిన రోబో సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అందులో చిట్టి అనే రోబో యజమాని అయినా వశీకర్ అలియాస్ రజనీకాంత్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇటువంటివి ఎక్కువగా మనకు హాలీవుడ్ సినిమాలలో కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ నిజజీవితంలో మనం తయారు చేసిన మిషన్ మనం మీదకే రివర్స్ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కాస్త భయంకరంగా ఉన్న ఈ ఘటన తాజాగా అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

అమెరికా సైన్యం ముందు అలాంటి ఆశ్చర్యకరమైన కేసు ఒకటి తెరపైకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడుపుతున్న యూఎస్ వైమానిక దళానికి చెందిన డ్రోన్ విధ్వంసానికి దారితీసింది. దానిని నియంత్రిస్తున్న ఆపరేటర్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా హత్య చేసింది. గత నెలలో యూఎస్ వైమానిక దళం ఒక పరీక్ష చేసింది.. ఈ పరీక్ష సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నియంత్రించబడే డ్రోన్ ను పరీక్షించడానికి ఒక లక్ష్యం ఇవ్వబడింది. అతను తన లక్ష్యాన్ని పూర్తి చేయాలి అన్న తాపత్రయంలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే డ్రోన్ తిరగబడింది.

దానిని ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని తన మార్గం నుంచి తొలగించింది. యూఎస్ ఎయిర్ ఫోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఆపరేషన్ చీఫ్ కల్నల్ టక్కర్ సిన్కొ హామిల్టన్ మాట్లాడుతూ.. అనుకరణ పరీక్షనుల్లో AAI డ్రోన్ తన లక్ష్యాన్ని సాధించడానికి ఆశ్చర్యకరంగా తన సొంత వ్యూహాన్ని అనుసరించినట్లు కనుగొన్నట్లు తెలిపాడు.