Site icon HashtagU Telugu

Italy: సూపర్‌మార్కెట్‌లో కత్తితోదాడి.. ఒకరు మృతి. ఫుట్‌బాల్ స్టార్ సహా నలుగురికి గాయాలు..!!

Pablo

Pablo

ఇటలీలోని మిలాన్ లోని ఓ సూపర్ మార్కెట్లో దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆర్సెనల్ ఫుట్ బాల్ ఆటగాడు పాబ్లో మారి కూడా ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో అతను షాపింగ్ చేస్తున్నారు. దాడిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ధానిక మీడియా ప్రకారం…గురువారం సాయంత్రం 6.30గంటలకు మిలానో ఫియోడి డి అస్సాగో షాపింగ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది.

ఫుట్ బాల్ ఆటగాడు పాబ్లో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మీడియా వెల్లడించింది. ఈ రోజు ఇటలీలో జరిగిన భయంకరమైన ఘటనలో పాబ్లో మారి, తోపాటు ఇతరులు కూడా గాయపడ్డారు. అని మీడియా పేర్కొంది. దాడిలో మరణించిన వ్యక్తి సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న ఉద్యోగిగా గుర్తించారు. అతను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. దాడి వెనకున్న ఉద్దేశ్యం ఏంటో ఇంకా స్పష్టత లేదన్నారు. ఉగ్రవాదంతో సంబంధం ఉందనడానికి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు.