Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ సెప్టెంబరు 2న మంగోలియాలో పర్యటించనున్నారు. రెండో ప్రపంచయుద్ధం జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మంగోలియా కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో సభ్యదేశంగా ఉంది. పుతిన్ మంగోలియా పర్యటనపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. పుతిన్‌ను అరెస్టు చేసి ఐసీసీ ఎదుట ప్రవేశపెట్టాలని కోరారు. ఉక్రెయిన్‌లో రష్యా నరమేధం చేసిందని.. ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి పుతినే(Putin) కారకుడు అని ఉక్రెయిన్ వాదిస్తోంది. అందుకోసం ఆయనను ఐసీసీ విచారించాలని కోరుతోంది.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటికే పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తమ సభ్యదేశాలన్నీ అరెస్టు వారెంట్‌ను గౌరవించాలని.. పుతిన్ కనిపించిన వెంటనే అరెస్టు చేసి అప్పగించాలని ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనేపథ్యంలో సెప్టెంబరు 2న జరగనున్న పుతిన్ మంగోలియా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ పర్యటనలో ఏం జరుగుతుంది అనే దాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఐసీసీ పిలుపును మంగోలియా గౌరవిస్తుందా ? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :Trump Vs Pakistan : పాక్‌పై అమెరికా ప్రేమ.. ట్రంప్ వద్దని చెప్పినా సాయం : మాజీ ఎన్ఎస్ఏ
ఈ ప్రచారం నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. పుతిన్ అరెస్టు అనేది అసాధ్యమని స్పష్టం చేసింది. మంగోలియాతో తమ దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించింది. ఎవరికైనా దమ్ముంటే పుతిన్‌ను అరెస్టు చేసి చూపించాలని సవాల్ విసిరింది. ఇటీవలే భారత ప్రధాని మోడీ కూడా రష్యా పర్యటనకు వెళ్లొచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేయాలని ఆ పర్యటన సందర్భంగా పుతిన్‌కు మోడీ సూచించారు. తద్వారా తన వంతుగా ప్రపంచ శాంతి స్థాపన ప్రయత్నాలను భారత్ చేసింది. భారత్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామని అప్పట్లో మోడీకి పుతిన్ హామీ ఇచ్చారు.