Site icon HashtagU Telugu

Myanmar : బౌద్ధ విహార పాఠశాలపై సైన్యం కాల్పలు.. 13 మంది చిన్నారులు మృతి..!!

Buddhist

Buddhist

మయన్మార్ లో దారుణం జరిగింది. బౌద్ధవిహారంలోని పాఠశాలపై మయన్మార్ సైన్యం హెలికాప్టర్ల ద్వారా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 7గురు చిన్నారులు సహా 13 మంది మృతి చెందగా..మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. సైనిక దళాలపై దాడి చేసేందుకు తిరుగుబాటుదారులు పాఠశాలను ఆసరగా చేసుకుని ఉపయోగించుకున్నట్లు మిలటరీ పేర్కొంది. తిరుగుబాటుదారులు గ్రామస్తులను కవచాలుగా ఉపయోగిస్తున్నారని సైన్యం ఆరోపించింది.

స్థానిక నివాసితులను ఉటంకిస్తూ మయన్మార్‌లోని సెంట్రల్ సాగింగ్ ప్రాంతంలోని ఒక గ్రామ బౌద్ధ ఆశ్రమంలో ఉన్న పాఠశాలపై సైన్యం శుక్రవారం హెలికాప్టర్లతో కాల్పులు జరిపినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. కాల్పుల్లో కొందరు చిన్నారులు అక్కడిక్కడే మరణించారు. అనంతరం గ్రామంలోకి సైన్యం ప్రవేశించి కాల్పులు జరిపింది. దీంతో మరికొందరు చిన్నారులు మరణించారు. ఇంటర్నెట్లో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. రక్తపు మడుగులో ఉన్న చిన్నారుల ఫొటోలు షేర్ చేశారు. గత ఏడాది ప్రారంభంలో, ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం కూల్చివేసింది. అప్పటి నుంచి మయన్మార్ హింసాకాండలో మొదలైంది. సాయుధ తిరుగుబాటుదారులు సైన్యంతో పోరాడుతున్నారు.

Exit mobile version