Airlift Plan – Israel : ఇజ్రాయెల్ నుంచి పౌరుల ఎయిర్ లిఫ్ట్.. నాలుగు దేశాల సన్నాహాలు

Airlift Plan - Israel : హమాస్ రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ లో మారణహోమం చెలరేగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 11:48 AM IST

Airlift Plan – Israel : హమాస్ రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ లో మారణహోమం చెలరేగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. అక్కడున్న తమ పౌరుల భద్రతపై అన్ని దేశాలు ఆందోళనగా ఉన్నాయి. హమాస్ రాకెట్ దాడుల కారణంగా ఇజ్రాయెల్ గగనతలం రిస్క్ ఫుల్ గా మారింది. దీంతో అక్కడికి చాలా దేశాల నుంచి విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఈక్రమంలో ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఈ లిస్టులో అర్జెంటీనా, కెనడా, ఆస్ట్రేలియా, పోలండ్ ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

హమాస్ చెరలో ఉన్న బందీలకు ఏదైనా జరిగితే.. 

అమెరికా పౌరులను కూడా ఎయిర్ లిఫ్ట్ ద్వారా స్వదేశానికి తీసుకురావాలని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అమెరికా కూడా రానున్న రోజుల్లో ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ -హమాస్ మధ్య యుద్ధం ఇప్పట్లో సమసిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా ఇజ్రాయెలీ బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు. వారు ఎలా ఉన్నారో తెలియడం లేదు. ఒకవేళ వారి ప్రాణాలకు ఏదైనా జరిగితే.. ఇజ్రాయెల్ తీవ్రమైన సైనిక చర్య చేసే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా తమ పౌరులను స్వదేశానికి తీసుకురావాలని పలు దేశాలు యోచిస్తున్నాయి.

Also read : Kethika sharma: హాట్ ఫోజులతో హీట్ పెంచుతున్న కేతిక శర్మ

అర్జెంటీనాలో 1.80 లక్షల మంది యూదులు.. 

తమ దేశ పౌరుల ఎయిర్ లిఫ్ట్ పై ఇప్పటికే అర్జెంటీనా విదేశాంగ మంత్రి శాంటియాగో కెఫిరో, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అధికారికంగా ప్రకటన విడుదల  చేశారు. అర్జెంటీనా తొలి విడతగా ఇజ్రాయెల్ నుంచి 625 మంది పౌరులను వెనక్కి తీసుకు వెళ్లనుంది. ఇందుకోసం ఆ దేశం పంపే ఒక మిలిటరీ హెర్క్యులస్ విమానం, రెండు బోయింగ్ జెట్ లు తొలుత సైప్రస్‌కు, అక్కడి నుంచి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్‌కు చేరుకుంటాయి. ఈ మూడు విమానాలు 625 మంది పౌరులతో రేపు(గురువారం) సాయంత్రంకల్లా టెల్ అవీవ్ నుంచి రోమ్‌కు బయలుదేరుతాయి. అర్జెంటీనాలో 1.80 లక్షల మంది యూదులు ఉన్నారు.  ప్రపంచంలో యూదు జనాభా అత్యధికంగా ఉన్న ఆరో దేశం ఇదే. ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకోలేని తమ పౌరుల కోసం సైనిక విమానాలను పంపాలని కెనడా ప్లాన్ (Airlift Plan – Israel) చేస్తోంది.