Mobile Phones Theft : అదొక మహా నగరం. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన పాలకుల దేశానికి రాజధాని అది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లు లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ఈ రకం దొంగతనాల సంఖ్య గత నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. ఈమేరకు వివరాలతో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం సంచలనం క్రియేట్ చేసింది.
Also Read :BJP MLAs : 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలలు సస్పెన్షన్ వేటు
ప్రతిరోజు 225 ఫోన్ల చోరీ
బ్రిటన్ (యూకే) రాజధాని లండన్(Mobile Phones Theft).. పౌరుల భద్రతకు పెట్టింది పేరు. అక్కడి పోలీసు వ్యవస్థ వరల్డ్ ఫేమస్. కానీ ఇప్పుడు అక్కడ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ప్రతినెలా వేలాది స్మార్ట్‌ఫోన్లు దొంగతనానికి గురవుతున్నాయి. ఈ దొంగతనాలను ఆపేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాల్సిన దుస్థితి వచ్చింది. 2024లో లండన్‌లో 83వేల ఫోన్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ లెక్కన ఆ ఏడాదిలో ప్రతిరోజు సగటున 225 ఫోన్లు చోరీ అయ్యాయి. లండన్‌లో జరిగిన చోరీల్లో 40 శాతం ఈ నగరం పరిధిలోని వెస్ట్ ఎండ్, వెస్ట్ మినిస్టర్ ఏరియాల్లో జరిగాయి. ఈవివరాలు సాక్షాత్తూ లండన్ పోలీసుల నివేదికల్లోనే ఉన్నాయి.
Also Read :Baba Ramdev: గంగానదిలో స్పీడుగా ఈతకొట్టిన బాబా రాందేవ్.. ఎందుకంటే..
ఫోన్ల చోరీలు ఇలా జరుగుతున్నాయి..
- లండన్ నగరంలోని రద్దీ ఏరియాలను దొంగలు లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.
- దొంగలు చోరీ చేసే క్రమంలో ఈ-బైకులు , మోపెడ్‌లను వాడుతున్నారు.
- లండన్‌లో ఒక్కో దొంగ ప్రతిరోజు సగటున 12 స్మార్ట్ ఫోన్లను దొంగిలిస్తున్నాడు. దీన్నిబట్టి ఆ దొంగలు ఎంత నిర్భయంగా చెలరేగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
- లండన్‌లోని కొన్ని క్రిమినల్ గ్యాంగులు ఈవిధంగా ఫోన్ల దొంగతనాల ద్వారా ఏటా సగటున రూ.500 కోట్ల దాకా సంపాదిస్తున్నాయట.
- సెల్‌ఫోన్ దొంగల ముఠాల కారణంగా లండన్ వీధుల్లో నడిచే వారు ఆందోళనకు గురవుతున్నారు.
- దీనిపై ఫోకస్ పెట్టిన లండన్ పోలీసు విభాగం.. ఇటీవలే ఒకే వారం వ్యవధిలో 230 మంది ఫోన్ దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి ఏకంగా 1000కిపైగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- ఫోన్లలో సెక్యూరిటీ అలర్ట్ ఫీచర్లను ఆన్ చేసి పెట్టుకోవాలని లండన్ ప్రజలకు పోలీసులు సూచించారు.