Warmest April : ఎండలు దంచికొట్టడంతో ‘2024 ఏప్రిల్’ ప్రపంచంలో అత్యంత వేడి నెలగా కొత్త రికార్డును లిఖించింది. యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ (సీ3ఎస్) దీనిపై సంచలన నివేదికను విడుదల చేసింది. వరుసగా గత 11 నెలలుగా భారీ టెంపరేచర్స్ నమోదయ్యాయని.. అదే ట్రెండ్ ఏప్రిల్‌లోనూ కొనసాగిందని సీ3ఎస్ తెలిపింది. ఎల్‌నినో ప్రభావం క్షీణిస్తుండటం, వాతావరణ మార్పుల వల్ల ఏప్రిల్‌లో టెంపరేచర్స్ అంతగా పెరిగాయని చెప్పింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పాటు భారీ వర్షపాతం వల్ల అనేక దేశాలలో ప్రజలు ఇబ్బందిపడ్డారని నివేదిక వివరించింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా యూఏఈలో భారీ వర్షపాతం నమోదైంది కూడా ఈ ఏప్రిల్ నెలలోనే అని వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో గత 13 నెలలుగా ప్రపంచంలోని సముద్రాల జలాలు వేడెక్కుతున్నాయని సీ3ఎస్ నివేదిక పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
సీ3ఎస్ నివేదికలోని కీలక అంశాలివీ..
- ఈ ఏడాది ఏప్రిల్‌లో (Warmest April) ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సీయస్‌కు పెరిగింది. ఇది 1850-1900లో ఏప్రిల్ నెలల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రతల కంటే 1.58 డిగ్రీల సెల్సీయస్ ఎక్కువ.
- 1991-2020 మధ్యకాలంలో ఏప్రిల్‌లో నమోదైన టెంపరేచర్స్‌తో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.67 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ అధికంగా నమోదైంది.
Also Read : US Vs Israel : ఇజ్రాయెల్‌కు అమెరికా షాక్.. ఏం చేసిందంటే.. !!
- ఎల్ నినో ఏర్పడినప్పుడు రుతుపవనాలు బలహీనపడుతాయి.
- ప్రస్తుతమున్న ఎల్ నినో 2023 జూన్‌లో తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది.
- ఎల్ నినో పరిస్థితులు సగటున ప్రతి రెండు నుంచి ఏడేళ్లకోసారి సంభవిస్తుంటాయి. దీని ప్రభావం దాదాపు 9 నుంచి 12 నెలల పాటు కంటిన్యూ అవుతుంది.
- అందుకే ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నాటికి లా నినో పరిస్థితులు ఏర్పడొచ్చని భారతదేశ వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది.