Ants Destruction : జర్మనీలో చీమల దండు బీభత్సం.. కొరికేస్తూ, నమిలేస్తూ..

‘టాపినోమా మాగ్నమ్’ జాతి చీమలు(Ants Destruction) సాధారణంగా మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Aggressive Ants Destruction In Germany Electricity Outage Internet Outage Tapinoma Magnum Ants

Ants Destruction : చీమ.. చీమ.. చీమ!! ఔను.. ఇప్పుడు చీమల దండు జర్మనీ ప్రజలకు చిరాకు పుట్టిస్తోంది. ‘టాపినోమా మాగ్నమ్’ జాతికి చెందిన చీమలు హల్‌చల్ చేస్తున్నాయి. జర్మనీలోని కొలోన్, హనోవర్ నగరాల్లోని మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నాయి. విద్యుత్ సరఫరా లైన్లు, ఇంటర్నెట్ నెట్‌వర్క్ కేబుల్స్‌ను కొరికేస్తున్నాయి. దీంతో పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు స్తంభించాయి. ఫలితంగా  చాలా వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లింది. చీమల దండు దాడి వల్ల ఆయా నగరాల్లోని జనజీవనం కూడా ప్రతికూలంగా ప్రభావితమైంది.

Also Read :Rana With Pak Army : పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరేతో రాణాకు లింకులు

విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు ఆటంకం

‘టాపినోమా మాగ్నమ్’ జాతి చీమలు(Ants Destruction) సాధారణంగా మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉంటాయి. ఈ చీమలు పెద్దసైజులో ఉంటాయి. ఇప్పుడు ఈ చీమలు ఉత్తర జర్మనీలోని పలు నగరాల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి.  ఈ చీలు ప్రధానంగా బాడెన్-వుర్టెంబర్గ్, పరిసర ప్రాంతాలలో వేగంగా కాలనీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటి కారణంగా కిహాల్ అనే నగరంలో ఇప్పటికే విద్యుత్, ఇంటర్నెట్ సేవలు స్తంభించాయి. ఈ చీమలు జర్మనీ పొరుగున ఉన్న ఫ్రాన్స్, స్విట్జర్లాండ్  వంటి ఇతర యూరోపియన్ దేశాలకు కూడా పాకాయి. అందుకే ఈ చీమల వల్ల ఏర్పడిన సంక్షోభం జర్మనీకి మాత్రమే పరిమితమైందని భావించడం సరికాదు.

Also Read :LunaRecycle Challenge: చందమామపై మానవ వ్యర్థాలు.. ఐడియా ఇచ్చుకో.. 25 కోట్లు పుచ్చుకో

ఆ చీమల జాతి గురించి.. 

‘‘టాపినోమా మాగ్నమ్ చీమల సూపర్ కాలనీలలో మిలియన్ల కొద్దీ చీమలు ఉంటాయి. ఇవి సాంప్రదాయ చీమల జాతుల కంటే చాలా రెట్లు పెద్దవి’’ అని కార్ల్స్రూహేలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని కీటక శాస్త్రవేత్త మాన్‌ఫ్రెడ్ వెర్హాగ్ చెప్పారు. ‘‘ఈ చీమల నివారణ కోసం జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత ప్రయత్నాలు జరగాలి. లేదంటే అవి జాతీయ స్థాయి విపత్తును క్రియేట్ చేస్తాయి’’ అని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకైతే టాపిన్మో మాగ్నమ్‌ జాతి చీమలను ప్రమాదకరమైన చీమల జాతిగా ప్రకటించలేదు. రానున్న రోజుల్లోనూ వాటి వల్ల సమస్యలు ఎదురైతే.. జర్మనీ ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  Last Updated: 12 Apr 2025, 07:24 PM IST