Site icon HashtagU Telugu

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత…5గురు మృతి..!

America Fire

America Fire

అమెరికాలో గన్ కల్చర్ పేట్రేగిపోతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఈఘటనల్లో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఐదుగురిని హతమార్చాడు. మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఈ కాల్పుల్లో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఏజెన్సీ నుండి అందిన సమాచారం ప్రకారం..ఈ సంఘటన సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పుల ఘటనతో నగరంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనను కరోలినా మేయర్ ధృవీకరించారు. “మనం ఇంకేదైనా చేయాలి”…ఇలాంటి హింసను ఆపాలంటూ పేర్కొన్నాడు.