మంకీ పాక్స్ (Mpox Virus)…ఇప్పుడు ప్రపంచ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా పీడ పోయిందని అంత భావిస్తుండగా..ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది. ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా మంకీ పాక్స్ కేసులు పాకిస్థాన్ (Pakistan ) లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే నాల్గు కేసులు నమోదు కాగా..తాజాగా మరో కేసు నమోదైంది. అంతర్జాతీయ విమానాల నుండి బయలుదేరిన వ్యక్తులలో మొత్తం ఐదు కేసులు కనిపించాయి. వీటిలో మూడు కేసుల్లో అవి ఏ వేరియంట్ అనేది తెలియరాలేదు. కరాచీ విమానాశ్రయంలో ప్రయాణికుడిని పరీక్షించినట్లు అధికారులు శనివారం తెలిపారు. అక్కడ ఇద్దరు అనుమానిత రోగులు కనిపించారు. అందులో 51 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వెంటనే హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
తొలుత ఆఫ్రికాకే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని WHO హెచ్చరికలు జారీ చేసింది. గతంలో కూడా మంకీపాక్స్ వైరస్ వెలుగు చూసినప్పటికీ ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
Read Also : Kashmir : మోడీ అండ్ టీమ్‌కు కశ్మీరీ యువత ఎగ్జిట్ డోర్ చూపిస్తుంది : ఖర్గే