Space Experiments: అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయి.. 276 రోజుల తర్వాత భూమిపైకి అంతరిక్ష నౌక..

అంతరిక్ష ప్రయోగాల్లో అద్బుతం చోటుచేసుకుంది. ఓ అంతరిక్ష నౌక 276 రోజుల తర్వాత తిరిగి భూమి మీదకు వచ్చింది. సిబ్బంది లేకుండా ఈ వ్యోమనౌక గతంలో అంతరిక్షంలోకి వెళ్లింది.

Published By: HashtagU Telugu Desk
2022 11 01 131613 1667307341. Large

2022 11 01 131613 1667307341. Large

Space Experiments: అంతరిక్ష ప్రయోగాల్లో అద్బుతం చోటుచేసుకుంది. ఓ అంతరిక్ష నౌక 276 రోజుల తర్వాత తిరిగి భూమి మీదకు వచ్చింది. సిబ్బంది లేకుండా ఈ వ్యోమనౌక గతంలో అంతరిక్షంలోకి వెళ్లింది. అనంతరం ఇప్పుడు భూమి మీదకు వచ్చినట్లు చైనా మీడియా తెలిపింది. సోమవారం వాయువ్య చైనాలోని జియుక్వాన్ ప్రయోగ కేంద్రానికి ఈ వ్యోమనౌక చేరుకున్నట్లు చైనా మీడియా వెల్లడించింది.

చైనా మీడియా కథనాల ప్రకారం.. ఆగస్టు 2022లో ఈ స్పెస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్లింది. ఇప్పుడు తిరిగి రావడంతో అది ఎంత ఎత్తుకు వెళ్లింది? దాని కక్ష్యలు ఎక్కడికి తీసుకెళ్లాయి? ఏమైనా సమాచారం లభించిందా? అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఈ వివరాలను మాత్రం మీడియా ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ అంతరిక్ష నౌకకు సంబంధించిన విజువల్స్ ను కూడా ఇంకా బయటపెట్టలేదు. అయితే భవిష్యత్తులో అంతరిక్ష యాత్రకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే 2021లో ఇలాంటి వ్యోమనౌక అంతరిక్షం అంచుకు చేరుకుని తిరిగి అదే రోజు భూమికి చేరుకుంది. వ్యోమనౌక చాలా సమాచారాన్ని తీసుకురావడంతో ఆ మిషన్ సక్సెస్ అయింది. ఇక గతంలో ఎక్స్ 37బి అనే అంతరిక్ష నౌక 900 రోజులకుపైగా కక్ష్యలో ఉండి గత ఏడాది నవంబర్ లో భూమిపైకి వచ్చింది. అలాగే బీజింగ్ యూఎస్ వైమానిక దళం ఎక్స్ 27బి వంటి మరో అంతరిక్ష నౌకను తయారుచేస్తోంది. ఇది చాలా సంవత్సరాలపాటు కక్ష్యలో ఉంటుందని చెబుతున్నారు. చైనా సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలను మౌంట్ చేయడానికి మరింత అనుకూలమైన, చవకైన మార్గాన్ని అందించే పునర్వినియోగ అంతరిక్ష సాంకేతికపై పరిశోధన చేయడానికి ఈ మిషన్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

  Last Updated: 08 May 2023, 11:41 PM IST