Site icon HashtagU Telugu

Tibet : టిబెట్‌లోని హిమనీనదాల్లో 15వేలఏళ్ల నాటి వైరస్ గుర్తింపు..!!

Tibetan

Tibetan

హిమనీనదాలు కరగడం వల్ల భయంకరమైన వైరస్ వ్యాప్తిచెందుతుందని ఈ మధ్యే ఓ అధ్యయనం హెచ్చరించింది. కోవిడ్ కు సంబంధించిన అన్ని రకాల ప్రమాద వైరస్ లు బ్యాక్టీరియాలు హిమనీనదాల్లో దాగి ఉన్నాయని పరిశోధనలో తేలింది. హిమనీనదాల్లో శాస్త్రవేత్తలు వైరస్ లపై పరిశోధనలు ప్రారంభించారు. అయితే అక్కడ కరుగుతున్న మంచు లో నుంచి పురాతన జీవులు బయటపడ్డాయి. ఈ వైరస్ లు మానవాళికి అత్యంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మైక్రో బయోమ్ లో ప్రచురించిన కథనంలో…టిబెటన్ పీఠభూమిలో గులియా ఐస్ క్యాప్ నుంచి డజన్ల కొద్దీ వైరస్ లను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ వైరస్ దాదాపు 15000ఏళ్ల కాలం నాటిది. ఈ హిమానీనదాలు క్రమంగా కరగటం వల్ల ఆ వైరస్ లు బయటకు వస్తున్నాయని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్ట్ జి పింగ్ జాంగ్ చెప్పారు. దుమ్ము, వాయువులతోపాటు అనేక వైరస్ లు ఆ హిమనీనదాల్లో దాగిఉన్నాయన్నారు.

కాగా సముద్రమట్టానికి 6.7కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ పురాతన కాలం నాటి హిమానీనదాల్లో 33 వైరస్ లలో 28 వైరస్ లు ఇంతకుముందెన్నడూ కనిపించలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వైరస్ లు మొక్కలు, నేలలోని మిథైల్ బ్యాక్టిరాయం జాతులలో నివసించే వైరస్ లకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. నేల లేదా మొక్కల నుంచి ఉద్బవించి…వాటికి అతిధేయల కోసం పోషకాలను సేకరించే వైరస్ లు కావచ్చని పరిశోధనా బ్రుంధం నిర్దారించింది. అయితే కోవిడ్ 19 మహమ్మారి తర్వాత ఈ వైరస్ లు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అతిపెద్ద ప్రమాదం ఏంటంటే మంచు కరిగిపోవడం వల్ల పెద్ద మీథేన్ , కార్బన్ విడుదలవుతున్నాయి. వాతావరణ మార్పులకు బ్యాక్టీరియా, వైరస్ లో ఎలాంటి ప్రభావం చూపనున్నాయి. ఈ అంశంపై మరికొన్ని పరిశోధనలు జరగాలని వెల్లడించారు.