Anand Mahendra: ఆనంద్ మహేంద్ర కు కొత్త సంవత్సరం నేర్పిన పాఠం..!

కొత్త సంవత్సరం వచ్చింది అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ పేరుతో తీర్మానాలు చేయడం మొదలు పెట్టేశారు.

  • Written By:
  • Publish Date - January 2, 2023 / 10:28 PM IST

Anand Mahendra: కొత్త సంవత్సరం వచ్చింది అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ పేరుతో తీర్మానాలు చేయడం మొదలు పెట్టేశారు. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర కూడా ఈ లిస్టులో చేరిపోయారు. తనకు కూడా ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం ఉందని చెప్పారు.

అయితే అది అందరిలా జిమ్ కు వెళ్లాలి, ఆహారం మితంగా తినాలి, పుస్తకాలు చదవాలి, తరచూ వ్యాయామం చేయాలి వంటివి కాకుండా తనది ప్రత్యేకమని అని చెప్పుకొచ్చారు. సాధారణంగా తనకు తీర్మానాలు చేసుకునే అలవాటు లేదని కానీ జీవితంలో ఎత్తు పల్లాలు ఒడిదుడుకులు సహజం అని అన్నారు. వాటిని వెంటనే దాటుకొని లక్ష్యం వైపు ముందుకు వెళ్లాలి అని చెబుతూనే ఇతరుల పట్ల సానుభూతి చూపుతూ ఆత్మవిశ్వాసంతో ఉండడమే తన ప్రేరణ అని తెలిపారు.

అయితే ఆయన ఒక వీడియో పోస్ట్ చేసి అందులో నల్లటి బోర్డు పైన చక్కటి డ్రాయింగ్ వేస్తున్న ఒక యువతని ఉద్దేశిస్తూ ఇలా చెప్పారు. ఆ బోర్డు లోని నల్లటి ప్రదేశం మనుషుల మధ్య ఉండే నెగెటివిటీ, ఖాళీ అని చెప్పారు. అందులో మనం ఎంత బాగా మన జీవితాన్ని చిత్రీకరించుకుంటే మన జీవితం కూడా ఆ చిత్రంలాగే అందంగా అర్థవంతంగా తయారవుతుందని దానికి భావనాన్ని తెలిపారు.

ఆనంద్ మహేంద్ర మాటల్ని గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో అంధకారం ఉంటుంది. వ్యక్తుల మధ్య ఎన్నో బేధాలు ఉంటాయి. అయితే వాటిని మరిచిపోయి తమ లక్ష్యం వైపు ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని అందంగా మలుచుకునే ప్రయత్నం చేసినప్పుడే మనం ఏ కొత్త సంవత్సరంలో అయినా సక్సెస్ అవుతాము.