665 Crores – Fighter Jet Missing : 665 కోట్ల యుద్ధ విమానం మిస్సింగ్.. ఆచూకీ చెప్పాలని ప్రజలకు పిలుపు

665 Crores - Fighter Jet Missing : అమెరికా సైన్యానికి చెందిన దాదాపు రూ.665 కోట్లు విలువ చేసే ఎఫ్ 35  ఫైటర్ జెట్ మిస్ అయింది.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 09:34 AM IST

665 Crores – Fighter Jet Missing : అమెరికా సైన్యానికి చెందిన దాదాపు రూ.665 కోట్లు విలువ చేసే ఎఫ్ 35  ఫైటర్ జెట్ మిస్ అయింది. అమెరికాలోని సౌత్‌ కరోలినా రాష్ట్రంలో ఉన్న బ్యూ ఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఎఫ్ 35 యుద్ధ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొంది. పైలట్ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాడు. పరిస్థితి మెరుగుకాక పోగా.. ఎమర్జెన్సీ మరింత పెరిగింది. దీంతో అందులో నుంచి పారాచూట్ సాయంతో పైలట్ కిందికి దూకేశాడు. ఆ తర్వాత  యుద్ధ విమానం ఎటు వైపు వెళ్లిందో కనిపించలేదు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి.

Also read : ITR Filing: కంపెనీల ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు తేదీ పొడిగింపు.. చివరి తేదీ ఇదే..!

ఇప్పుడు అమెరికా మిలటరీ అధికారులు ఎఫ్ 35  ఆచూకీని వెతికే పనిలో పడ్డారు. ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్‌తో కలిసి పోర్టు సిటీ అయిన చార్లెస్టన్‌లో ఫైటర్ జెట్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చార్లెస్టన్ నగరంలో ఉన్న రెండు సరస్సుల్లో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఆచూకీ గల్లంతైన ఫైటర్ జెట్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే చెప్పాలని పరిసర ప్రాంతాల ప్రజలను ఆర్మీ అధికారులు కోరారు.  ఎలాంటి సమాచారమైనా తెలిస్తే చెప్పేందుకు.. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లను అధికారులు విడుదల చేశారు. కాగా, ఎఫ్‌ 35 ఫైటర్ జెట్‌ను లాక్‌హీడ్ మార్టిన్‌ సంస్థ (665 Crores – Fighter Jet Missing ) తయారు చేసింది.