Site icon HashtagU Telugu

America: మంచు గడ్డల్లో చిక్కుకున్న 81 ఏళ్ళ వృద్ధుడు..7 రోజులపాటు కారులోనే..చివరికి ఏమైందంటే?

America

Whatsapp Image 2023 03 12 At 8.41.37 Pm

America: అమెరికాలో 81 ఏళ్ల వృద్ధుడు మంచు తుపానులో చిక్కుకున్నాడు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు. ఏకంగా అలా 7 రోజులు పాటు మంచు తుఫాన్ (tufan)లో గడిపాడు. ప్రాణాల మీద ఆశ వదులుకోకుండా పట్టుదలతో మృత్యువుతో పోరాడి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ ఏడు రోజులూ స్వీట్స్, క్రోసెంట్లు, బిస్కట్లను తింటూ ప్రాణాలతో బయటపడ్డాడు. వాస్తవానికి కాలిఫోర్నియాలో నివసిస్తున్న 81 ఏళ్ల జెర్రీ జౌరెట్ గణిత శాస్త్రజ్ఞుడు. మాజీ నాసా ఉద్యోగి. జెర్రీ మంచు తుఫాన్ కురుస్తున్న సమయంలో కారుని డ్రైవింగ్ చేసుకుంటూ హైవేపై వెళ్తూ, మంచు తుఫాను(tufan)లో చిక్కుకున్నాడు. ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలోని బిగ్ పైన్‌లోని తన ఇంటి నుండి నెవాడాలోని గార్డ్‌నెర్‌విల్లేకు తన కుటుంబాన్ని కలవడానికి బయలుదేరినప్పుడు ఈ ఘటన జరిగింది. వాతావరణం మంచిగా ఉంటే తాను ఉన్న ప్రదేశం నుంచి కుటుంబ సభ్యులున్న ప్రాంతానికి చేరుకోడానికి 3 గంటలు మాత్రమే పడుతుంది.

ఓ జాతీయ నివేదిక ప్రకారం సుమారు 30 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత జెర్రీ జౌరెట్ తన కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఇరుకైన సందులో మంచు తుఫానులో చిక్కుకున్నాడు. అనంతరం జెర్రీకి ఏ రకమైన సహాయం అందలేదు. కారులోనే గడిపాడు.అమెరికాలో (America) రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఎటువంటి దుస్తులు లేవు. తేలికపాటి విండ్ బ్రేకర్, హోటల్ బాత్ టవల్ ఉన్నాయి. జెర్రీ జౌరెట్ మనవడు క్రిస్టియన్ మీడియాతో మాట్లాడారు. తాత జౌరెట్ కారులోనే ఉండి, తక్కువ గ్యాస్, బ్యాటరీ శక్తిని ఉపయోగించి కారుని వేడి చేస్తూనే ఉన్నాడు. తన వెంట తీసుకెళ్లిన కొన్ని చిరుతిళ్లు తింటూ బతికాడు. ఈ సమయంలో కొన్నిసార్లు మంచు తినడానికి కారు కిటికీ అద్దాన్ని క్రిందికి తీసేవాడు. అలా బయటపడ్డాడని చెప్పుకొచ్చాడు.

Also Read : KTR: దుబాయ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నవారిని విడుదల చేయండి: కేటీఆర్ విజ్ఞప్తి

Exit mobile version