అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులపై పెరుగుతున్న దాడులపై అమెరికాకు చెందిన ఓ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై ప్రమాదకరమైన విద్వేషం మొదలైందని ఆ సంస్థ పేర్కొంది. శ్వేత బూర్జువాలు, ఇస్లాం అనుచరుల వల్లే హిందువులపై ద్వేషం 1000 శాతానికి పైగా పెరిగిందని పరిశోధన సంస్థ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ,సహ వ్యవస్థాపకుడు జోయెల్ ఫికెల్‌స్టెయిన్ అన్నారు. ఉత్తర అమెరికాలోని హిందువులు ఏర్పాటు చేసిన అమెరికన్ క్యాపిటల్‌లో కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందూ వ్యతిరేక కార్యకలాపాలు పెరగడం వల్ల మరింత ఆందోళనను కలిగిస్తుందన్నారు. ఈ మధ్యే అమెరికా, కెనడాలో ఈమధ్యే హిందూ దేవాలయాలపై జరిగిన దాడిని ఆయన గుర్తుచేశారు. ఈ విధంగా విధ్వంసం వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడుతూ భారత్‌లో ముస్లింలపై హింస పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఇందుకోసం హిందూత్వ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు.