Site icon HashtagU Telugu

H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

H1B Visa

H1B Visa

H1B Visa: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం లేబర్ డిపార్ట్‌మెంట్ (కార్మిక శాఖ) ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో H-1B వీసా (H1B Visa) ‘దుర్వినియోగం’ గురించి భారతదేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీసా సేవలను అత్యధికంగా అతిపెద్ద స్థాయిలో వినియోగించుకుంటున్న దేశంగా భారతదేశాన్ని పేర్కొన్నారు. ఈ ప్రకటన ఒక రకమైన సోషల్ మీడియా ప్రచారం. దీని ద్వారా కంపెనీలు H-1B వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశాయని, విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు, అమెరికన్ల ఉద్యోగాలను లాక్కున్నారని ఆరోపించారు.

కంపెనీలదే బాధ్యత: లేబర్ డిపార్ట్‌మెంట్

డిపార్ట్‌మెంట్ తన అధికారిక ‘X’ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది. దానికిచ్చిన శీర్షిక (Caption)లో “H-1B వీసా భారీ దుర్వినియోగం కారణంగా అమెరికా యువత కలలు కరిగిపోయాయి. ఎందుకంటే వారి ఉద్యోగాలను విదేశీ ఉద్యోగులు లాక్కున్నారు. ఈ దుర్వినియోగానికి కంపెనీలను బాధ్యులను చేసి, జవాబుదారీగా ఉంచుతున్నాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సెక్రటరీ లోరీ షావెజ్-డెరెమర్ సహాయంతో అమెరికన్ల కలను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాము” అని పేర్కొంది.

Also Read: 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

సెప్టెంబర్ 2025లో కొత్త వీసా నియమాలు

అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ పేరుతో ఒక చొరవను ప్రారంభించింది. దీని కింద ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో H-1B వీసాకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేసింది. దేశంలోని ఐటీ కంపెనీలు తక్కువ జీతాలు తీసుకునే H-1B హోల్డర్లను నియమించుకోకుండా నిరోధించడం, అమెరికా నిపుణులను ఉద్యోగాల కోసం నియమించుకోవడాన్ని ప్రోత్సహించడం ఈ నిబంధనల లక్ష్యం. తద్వారా ‘అమెరికా ఫస్ట్’ పాలసీ విజయవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

51 సెకన్ల వీడియోలో 1950 నాటి అమెరికా

లేబర్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన 51 సెకన్ల వీడియోలో 1950 నాటి అమెరికాను చూపించారు. అందులో ఇళ్లు, ఫ్యాక్టరీలు, సంతోషంగా నవ్వుతూ ఆడుకుంటున్న కుటుంబాలు కనిపించాయి. ఆ నాటి అమెరికాను నేటి అమెరికాతో పోల్చారు. అమెరికా H-1B వీసాలలో 72 శాతం భారతీయులకు అందుతోందని వీడియోలో పేర్కొన్నారు. అమెరికా వీసాను బయటి వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని, దీనివల్ల అమెరికా యువతకు అన్యాయం జరుగుతోందని, ట్రంప్ ప్రభుత్వం దీనిని సహించదని వీడియోలో తెలిపారు.

Exit mobile version