అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) మరోసారి ప్రపంచ వ్యాపారానికి షాక్ ఇచ్చారు. భారత్‌తో పాటు సుమారు 70 దేశాలపై అధిక టారిఫ్‌లు (భారీ సుంకాలు) విధించనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఆయా దేశాలపై జరిమానాలు, దిగుమతులపై అధిక సుంకాలు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఆయా దేశాలకంటే అమెరికానే అని స్పష్టమవుతోంది. అధిక టారిఫ్‌లు కారణంగా అమెరికాలో ద్రవ్యోల్భణం పెరిగి, ప్రతి కుటుంబంపైనా సగటున సుమారు 2,400 డాలర్లు (రూ. 2 లక్షలు) భారం పడుతుందని అంచనా వేసింది.
Content Creators : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న గూగుల్?
ఈ టారిఫ్ భారం అన్ని ఆదాయ వర్గాలకూ సమానంగా ఉండదని నివేదిక పేర్కొంది. అల్పాదాయ కుటుంబాలపై సుమారు 130 డాలర్లు భారమైతే, అధిక ఆదాయ వర్గాలపై 5,000 డాలర్ల వరకూ ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పింది. అంటే మధ్యతరగతిపై గణనీయంగా భారం పడే ప్రమాదం ఉంది. ఖర్చులు పెరగడం, కొనుగోలు సామర్థ్యం తగ్గడం వంటివి కలిపి అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్నాయని నివేదిక హెచ్చరించింది. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా జీడీపీ వృద్ధి రేటు 40–50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక భారత్‌పై ప్రభావం ఉండే అవకాశమున్నా, అమెరికాతో పోలిస్తే తక్కువ స్థాయిలోనే ఉంటుందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. డాలర్ విలువ తగ్గే అవకాశం, అంతర్జాతీయ ధరల పెరుగుదల వంటివి భారత్‌కు స్వల్పకాలిక ఒడిదుడుకులను కలిగించవచ్చునని తెలిపింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని, విదేశీ మారకద్రవ్య నిల్వలు, దేశీయ విధానాలు ఈ ప్రభావాన్ని తగ్గించగలవని పేర్కొంది. మొత్తంగా ట్రంప్ టారిఫ్ విధానాల ప్రభావం భారత్ కన్నా ఎక్కువగా అమెరికాపైనే ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.