అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

సరఫరా చేసే బంగారు కడ్డీలలో కనీసం 98 శాతం స్వచ్ఛమైన బంగారం ఉండాలనే నిబంధన విధించారు.

Published By: HashtagU Telugu Desk
Gold Deal

Gold Deal

Gold Deal: అమెరికా- వెనిజులా మధ్య బంగారానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం వెనిజులా ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ‘మినర్వెన్’ అమెరికన్ మార్కెట్ కోసం బంగారాన్ని సరఫరా చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వెనిజులా-అమెరికా గోల్డ్ డీల్

అమెరికా- వెనిజులా మధ్య జరిగిన ఈ ఒప్పందం ద్వారా అమెరికా చమురుతో పాటు వెనిజులా ఖనిజాలపై కూడా తన పట్టును పెంచుకుంటోందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పందంలో భాగంగా బంగారానికి బదులుగా వెనిజులాకు డాలర్లలో చెల్లింపులు చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చే నిధులను దేశాభివృద్ధి పనుల కోసం ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: మ‌రికాసేప‌ట్లో భార‌త్‌- న్యూజిలాండ్ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఎక్క‌డ చూడాలంటే?!

ముఖ్య అంశాలు

సరఫరా: మినర్వెన్ కంపెనీ సుమారు 650 కిలోల నుండి 1,000 కిలోల వరకు బంగారు కడ్డీలను కమోడిటీ ట్రేడర్ ‘ట్రాఫిగురా’కు అందజేస్తుంది.

నాణ్యత: సరఫరా చేసే బంగారు కడ్డీలలో కనీసం 98 శాతం స్వచ్ఛమైన బంగారం ఉండాలనే నిబంధన విధించారు.

రవాణా: మినర్వెన్ నుండి ఈ బంగారాన్ని తీసుకున్న తర్వాత దానిని అమెరికాకు చేరవేసే బాధ్యతను ట్రాఫిగురా సంస్థ చూసుకుంటుంది. ఒక ప్రత్యేక ఒప్పందం ప్రకారం.. అమెరికాలోని రిఫైనరీలకు ఈ బంగారాన్ని పంపిస్తారు.

చమురుపై పెరుగుతున్న అమెరికా నియంత్రణ

వెనిజులాలోని అత్యంత కీలకమైన వనరు అయిన చమురుపై అమెరికా ఇప్పటికే సమర్థవంతమైన నియంత్రణను సాధించినట్లు సమాచారం. ట్రాఫిగురా సంస్థ వెనిజులాలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆయిల్ కాంట్రాక్టులతో కూడా ముడిపడి ఉంది. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చమురు ప్రవాహం ప్రారంభమైందని, రెండు దేశాల మధ్య ఇటువంటి వృత్తిపరమైన సహకారం చూడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వెనిజులా- అమెరికా మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాలకు సంకేతంగా కనిపిస్తోంది.

  Last Updated: 08 Mar 2026, 05:18 PM IST