Site icon HashtagU Telugu

US Firing : అమెరికాలో కాల్పులు…యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో జరిగిన కాల్పుల్లో 3విద్యార్థులు మృతి..!!

Gun

Gun

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యూనిర్సిటీ ఆఫ్ వర్జీనియా క్యాంపస్ లో ఫుట్ బాల్ జట్టులోని ముగ్గురిని కాల్చిచంపాడు. కాల్పులకు పాల్పడిన 22ఏళ్ల అనుమానిత విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగినట్లు అధికారులు తెలిపారు.

యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంతాపం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరిన్ జీన్-పియర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మరో ఘోరమైన కాల్పులు జరగడం పట్ల అమెరికా అధ్యక్షుడు విచారం వ్యక్తం చేశారు. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మ్రుతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ప్రకటించారు. కాగా గాయపడిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించగా, మరొకరి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో కాల్పుల ఘటన తర్వాత గందరగోళం నెలకొంది.