Secret Island : భారత్ నుంచి 3,183 కి.మీ దూరంలో హిందూ మహాసముద్రంలో డీగో గార్సియా ద్వీపం ఉంది. దీనిపై చట్టపరమైన హక్కులు బ్రిటన్‌కు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ద్వీపంలో అమెరికా, బ్రిటన్ సైన్యాలు ఉన్నాయి. ఈ ద్వీపంలోకి ఎవరినీ అనుమతించరు. టూరిస్టులు కూడా అక్కడికి వెళ్లలేరు. మానవ హక్కుల సంఘాలను సైతం డీగో గార్సియాలోకి అడుగుపెట్టనివ్వరు. అంతలా నిరంకుశంగా అమెరికా, బ్రిటన్ సైన్యాలు అక్కడ వ్యవహరిస్తాయి.
Also Read :Gachibowli Lands: తిరుగులేని దానం.. గచ్చిబౌలిలో 10 ఎకరాలు ఇచ్చేసిన యాక్టర్
డీగో గార్సియా చరిత్ర
1965లో బ్రిటన్ దూకుడుగా వ్యవహరించింది. మారిషస్ దేశం నుంచి చాగోస్(Secret Island) ద్వీపసమూహాన్ని వేరు చేసింది. ఇందులో దాదాపు 60 దీవులు ఉండేవి. వాటిలో ఒకదాని పేరే డీగో గార్సియా. బ్రిటన్ స్థాపించిన చివరి వలస కాలనీ ఇదే. బ్రిటన్, అమెరికాలు డీగో గార్సియాలో వ్యూహాత్మకంగానే సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాయి. ఎందుకంటే ఇది తూర్పు ఆఫ్రికా, ఇండోనేషియాలకు సమానమైన దూరంలో ఉంటుంది. తమ మిస్సైళ్లు , యుద్ధ విమానాలకు తగిన రేంజులో ఆసియా దేశాలన్నీ ఉండాలనే లక్ష్యాన్ని ఆనాడు బ్రిటన్, అమెరికా నిర్దేశించుకున్నాయి. మొత్తం మీద ఈ సీక్రెట్ దీవి భారత్, చైనా, పాక్ సహా అన్ని ఆసియా దేశాలకు గండం లాంటిది. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే.. డీగో గార్సియా కేంద్రంగా ఆసియా దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉంది. డీగో గార్సియాలోని తమ వైమానిక స్థావరాన్ని చూపించి.. ఆసియా దేశాలను అమెరికా, బ్రిటన్ బెదిరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్‌పై దాడుల కోసం.. డీగో గార్సియాలోనే అణ్వస్త్ర బాంబర్లను, యుద్ధ విమానాలను, మిస్సైళ్లను అమెరికా మోహరించింది.
Also Read :Ration Cards: ఆ రేషన్ కార్డులు రద్దు.. ఈ-కేవైసీపై కొత్త అప్‌డేట్
డీగో గార్సియా ప్రజలంతా ఎలా మాయం అయ్యారు ?
1966 నాటికి డీగో గార్సియాలో చాగోసియన్ అటవీ తెగకు చెందిన 924 మంది నివసించేవారు. అయితే 1968 నుంచి 1973 మధ్యకాలంలో బ్రిటన్ సైన్యాలు వాళ్లందరినీ బెదిరించి, సమీపంలోని ఇతర ప్రాంతాలకు బలవంతంగా వలస పంపాయి. మాట వినని వారిని ఏం చేశారో ఇప్పటికీ తెలియదు. నాటి నుంచి నేటిదాకా డీగో గార్సియా ద్వీపంలో కేవలం అమెరికా, బ్రిటన్ సైనికులు మాత్రమే ఉంటున్నారు. వాళ్లను కాదని, అక్కడ చీమ కూడా కదల్లేదు. డీగో గార్సియాలోని ఆటవిక తెగ ప్రజలను తరిమేయడం చట్ట వ్యతిరేకమని, అది మానవ హక్కుల ఉల్లంఘన అని 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బ్రిటన్ సైన్యం చేష్టలను తప్పుపట్టింది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో బ్రిటన్ ప్రభుత్వం విభేదించింది.
పడవలే దిక్కు..
డీగో గార్సియాలోకి వెళ్లేందుకు రోడ్డు మార్గం లేదు. అక్కడికి విమానాలు కూడా వెళ్లవు. కేవలం హిందూ మహాసముద్రం గుండా పడవల్లో వెళ్లాలి. అది కూడా అక్కడి సైన్యాల అనుమతితోనే. పర్మిషన్ లేకుంటే వెళ్లలేం. జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, టూరిస్టులను ఈ ద్వీపంలోకి అనుమతించరు. ఒకవేళ అక్కడ మీడియా ప్రతినిధులు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ అడుగుపెడితే.. నిజాలు బయటికి వస్తాయి. డీగో గార్సియా ఆటవిక తెగల వలసలతో ముడిపడిన కీలక విషయాలు బయటికి వస్తాయి. అందుకే వారిని రానివ్వరు.