Hindu Temple: హిందూ దేవాలయం వెలుపల ‘అల్లాహు అక్బర్’ నినాదాలు…ఎక్కడో తెలుసా..?

ఇంగ్లండ్ లోని స్మెత్ విక్ లోని హిందూ దేవాలయం వద్ద  ఘర్షణ వాతావరణం నెలకొంది. దాదాపు 2వందల మంది ముస్లింలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

  • Written By:
  • Updated On - September 21, 2022 / 01:14 PM IST

ఇంగ్లండ్ లోని స్మెత్ విక్ లోని హిందూ దేవాలయం వద్ద  ఘర్షణ వాతావరణం నెలకొంది. దాదాపు 2వందల మంది ముస్లింలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హిందూ దేవాలయం ముందు గుమిగూడిన ముస్లింలు అల్లాహు అక్బర్’ అంటూ నినాదాలు చేశారు. 2వందల మంది ముస్లింలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్పాన్ లేన్ లోని దుర్గా భవన్ హిందూ సెంటర్ వైపు పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసన తెలిపినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అందులో చాలా మంది ‘అల్లాహు అక్బర్’ అంటూ నినాదాలు చేశారు.

శాంతి భద్రతల ద్రుష్ట పోలీసులు అక్కడికి చేరుకోగా కొంతమంది నిరసనకారులు గోడలు ఎక్కడం వీడియోలో కనిపిస్తోంది. కాగా బర్మింగ్ హోమ్ వరల్డ్ నివేదిక ప్రకారం…అప్నా ముస్లిం అనే సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మంగళవారం దుర్గాభవన్ ఆలయంలో శాంతియుత నిరసన కోసం పిలుపునిచ్చినట్లు పేర్కొంది. తూర్పు ఇంగ్లండ్ లోని లీసెస్టర్ లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.