Site icon HashtagU Telugu

Ebrahim Raisi : కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. ఏమిటా హెలికాప్టర్ నేపథ్యం ?

Ebrahim Raisi

Ebrahim Raisi

Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ(Ebrahim Raisi),  విదేశాంగ మంత్రిగా అమీర్ అబ్దుల్లా హియాన్‌లు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వీరిద్దరు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలికాప్టర్ ఆదివారం నాడు అజర్‌బైజాన్ దేశ సరిహద్దుల్లోని మంచు పర్వతాల్లో కుప్పకూలింది. ఈనేపథ్యంలో ఆ హెలికాప్టర్‌కు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

‘బెల్ 212’ హెలికాప్టర్‌‌ను ‘బెల్ టూ-ట్వెల్వ్’ అని కూడా  పిలుస్తారు. రెండు బ్లేడ్లు ఉండే మిడ్ రేంజ్ హెలికాప్టర్ ఇది. 1968 నుంచి దీని వినియోగం మొదలైంది. వాస్తవానికి అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న ఫోర్ట్ వర్త్‌లో ఈ హెలికాప్టర్ తయారైంది. అయితే 1986 నుంచి దీని ఉత్పత్తి ప్రక్రియను కెనడాలోని కెనడాలోని మిరాబెల్ ప్రాంతంలో జరగసాగింది. అక్కడే బెల్ కమర్షియల్ హెలికాప్టర్ల ఉత్పత్తి పెద్దసంఖ్యలో జరిగింది. పౌర విమానయాన సంస్థలకు ఈ హెలికాప్టర్లను పెద్దసంఖ్యలో విక్రయించారు. ఇందులో పైలట్‌తో పాటు 14 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.  ఈ హెలికాప్టర్ 2,268 కేజీల బరువును మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వియత్నాం యుద్ధం టైంలో అమెరికా కూడా ఈ హెలికాప్టర్లను వినియోగించింది.

Also Read :Chicken Price : చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. ఎందుకు ?

Also Read : Haldiram: రూ. 70 వేల కోట్ల ఆఫ‌ర్‌.. నో చెప్పిన హల్దీరామ్ కంపెనీ..!