Britain: ఇదేందయ్యా ఇది.. మద్యానికి బానిసైన కుక్కకి ట్రీట్మెంట్?

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యం సేవించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని

  • Written By:
  • Publish Date - April 11, 2023 / 05:45 PM IST

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యం సేవించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలిసినా కూడా మద్యం బాబులు మాత్రం తాగడం ఆపరు. టీవీలలో వార్తల్లో ప్రకటనల్లో ప్రతి ఒక్క చోట మనం మద్యం సేవించరాదు అనే వాటిని చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం. అయినప్పటికీ మద్యం సేవించడం మాత్రం ఆపరు. చాలా మంది అతిగా మద్యం సేవించి ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే మామూలుగా మద్యం సేవించిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటివరకు మీరు మద్యానికి బానిస అయినా మనుషుల గురించి విని ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వార్త మాత్రం ఎప్పుడు విని ఉండరేమో.. ఎందుకంటే ఒక కుక్క మద్యానికి బానిస అయ్యింది. ఇదేంటి కుక్క మద్యానికి ఏంటని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే. ఈ సరికొత్త ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. మద్యానికి బానిస అయినా పెంపుడు కుక్క ఇటీవలే ఆ వ్యసనం నుంచి బయటపడింది. బ్రిటన్ లోని ప్లిమొత్ ప్రాంతంలో ఒక వ్యక్తి మద్యం ఎక్కువగా సేవించి ఈ మద్యానికి బానిస అయ్యాడు. అతడు కుక్కకు కూడా మద్యం పోయడంతో అది కూడా మద్యం సేవించడం అలవాటు చేసుకుంది.

అలా రాను రాను ఆ కుక్క మద్యానికి బానిసగా మారిపోయింది. యజమాని మరణించిన తర్వాత ఆ కుక్క తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. అది గమనించిన స్థానికులు కుక్కలు జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించగా వారు ఆ కుక్కకు తరచూ ఫిట్స్ రావడం గమనించారు. ఇతర సమస్యలతో కూడా సతమతమవుతున్నట్లు వాళ్లు గుర్తించారు. ఆ తర్వాత దాని రోగ లక్షణాలను పరిశీలించిన వైద్యులు ఆ కుక్క మద్యానికి బానిస అయ్యింది అన్న విషయాన్ని గుర్తించి దానికి చికిత్స చేయడం ప్రారంభించారు. ఇటీవలె ఆ కుక్క మద్యం బానిస నుంచి కోలుకుంది. అయితే ఒక కుక్క మద్యానికి బానిస అయ్యి కోలుకోవడం అన్నది ప్రపంచంలో ఇదే మొదటి కేసు కావడం విశేషం.