Russia Ukraine War: అజిత్ దోవల్ రష్యా పర్యటన చర్చనీయాంశంగా మారింది. దోవల్ పర్యటనతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలన్నీ భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వైపు చూస్తున్నాయి. ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశంపై చాలాసార్లు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. పలు వేదికలపై శాంతియుత పరిష్కారాన్ని మోడీ హైలేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారంపై చర్చల కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లనున్నట్లు సమాచారం.
అజిత్ దోవల్( Ajit Doval) ప్రధాని మోదీ శాంతిదూతగా రష్యాకు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన వాదించనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనలో యుద్ధాన్ని ఆపడం గురించి ఆ దేశ ప్రధానితో చర్చించారు. మోడీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు మోడీతో పంచుకున్నారు. అంతేకాదు యుద్దానికి శుభం కార్డు పడాలంటే అది మోడీ వల్లనే సాధ్యమవుతుందని జెలెన్స్కీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు జరపడం ద్వారా శాంతిని నెలకొల్పడంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిఅన్నారు. యుద్ధాన్ని పరిష్కరించడంలో చైనా, భారత్‌ల పాత్ర ముఖ్యమని మెలోని పేర్కొన్నారు. అంతేకాదు జాతీయ ప్రయోజనాల కోసం యుద్దాన్ని ఆపడానికి ఆ దేశం మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
Also Read: Survey On Physical Relations: శారీరక సంబంధాలపై సర్వే.. షాకింగ్ విషయాలు వెల్లడి..!