అమెరికాలోని పశ్చిమ, మధ్య రాష్ట్రాల్లో బలమైన శీతాకాలపు తుఫాను కారణంగా సుమారు 1300 విమానాలను (1,300 Flights) అమెరికా రద్దు చేసినట్లు రాయిటర్స్ నివేదించింది. దీంతో పాటు సుమారు 2000లకు పైగా విమానాలను ఆలస్యమయ్యాయని పేర్కొంది. అమెరికాలో మంచు తుఫాను కారణంగా 1300కు పైగా విమానాలు రద్దయ్యాయి. 2000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు తుపాను పశ్చిమ, మధ్య రాష్ట్రాలను వణికిస్తోంది. దీంతో జనం రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఇప్పటికే ప్రతికూల వాతావరణం గురించి హెచ్చరించింది. పశ్చిమ, మధ్య రాష్ట్రాల్లో మంచు తుఫానుల కారణంగా చాలా విమానాలు రద్దు చేయబడవచ్చని FAA తెలిపింది. అమెరికాలో మంచు తుపాను కారణంగా విమానయాన సంస్థపై తీవ్ర ప్రభావం పడింది. తుపాను కారణంగా అమెరికాలోని 1000కు పైగా విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నెల ప్రారంభంలో అమెరికాలోని విమానయాన సంస్థలు కూడా ప్రభావితమయ్యాయి. 1400కు పైగా విమానాలు రద్దయ్యాయి.
Also Read: 10 Palestinians Killed: ఇజ్రాయెల్ సైన్యం దాడిలో 10 మంది మృతి
విమానాశ్రయంలో మంచు కనిపిస్తోంది. హిమపాతం, బలమైన గాలులు వీస్తాయని అమెరికా వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. మంచు తుపాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారవచ్చని ఆ శాఖ తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా, దేశీయ విమానయాన సంస్థ స్కైవెస్ట్ ఇంక్ 312 విమానాలు రద్దు చేశారు. అదే సమయంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 248 విమానాలు, డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 246 విమానాలు రద్దు చేయబడ్డాయి.