ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు వికటించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురయ్యేలా చేసింది. క్రిస్మస్ (Christmas) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడ్రోజుల ముందు నుంచే క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. సామాన్యులతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా తమ సన్నిహితులు, స్నేహితులకు క్రిస్మస్ కానుకలను పంపిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు వికటించి దాదాపు 700 మంది అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ ఫ్రాన్స్ లోని మోంటోయిర్ డి బ్రిటేన్‌లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు డిసెంబర్ 24న క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విందులో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. విందు కు వచ్చిన ఉద్యోగుల కోసం రకరకాల నోరురించే వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో లాబ్ స్టర్లు, ఆల్చిప్పలు, బీఫ్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. అయితే, విందు అనంతరం దాదాపు 700 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో కొందరు ఉద్యోగులకు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన వారందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆహారం నాణ్యత లోపం వల్లే తమ వారు అస్వస్థకు గురయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సదరు రెస్టారెంట్‌పై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also : Muggu: ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా.. అయితే ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిందే?