X Cyber Attack: విఖ్యాత సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్) సోమవారం చాలా దేశాల్లో డౌన్ అయింది. 24 గంటల వ్యవధిలో దాదాపు మూడు సార్లు ఎక్స్ సేవలకు అంతరాయం వాటిల్లింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7.30 గంటలకు, 9 గంటలకు ఎక్స్ సేవలు స్తంభించాయి. భారత్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల యూజర్లకు ఈ అంతరాయం కలిగింది. దీనిపై దాదాపు 40వేల మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. వీరిలో 56 శాతం మంది యాప్ యూజర్లు, 33 శాతం మంది వెబ్‌సైట్ యూజర్లు.
Also Read :Chemsex: కెమ్ సెక్స్.. ఏమిటిది ? ఎలా చేస్తారు ? ఏమవుతుంది ?
ఉక్రెయిన్ పనే అంటున్న మస్క్
‘ఎక్స్’ సేవలకు అంతరాయం కలగడంపై ఆ కంపెనీ యాజమాని, అపర కుబేరుడు ఎలాన్ మస్క్(X Cyber Attack) రియాక్ట్ అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్స్‌పై సైబర్ దాడి జరిగింది. దాని వెనక పెద్ద హ్యాకింగ్ గ్రూప్ లేదా ఒక దేశం ఉంది’’ అని ఆయన వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన హ్యాకింగ్ గ్రూపు మూలాలను గుర్తించే పనిలో తాము బిజీగా ఉన్నట్లు మస్క్ తెలిపారు. దీనికి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ఎక్స్‌పై సైబర్ దాడికి పాల్పడిన ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్ దేశంలో ఉన్నట్టుగా మేం గుర్తించాం’’ అని మస్క్ ఆరోపించారు.
Also Read :Ukraine Vs Russia: 73 డ్రోన్లతో మాస్కోపై ఎటాక్.. రెచ్చిపోయిన ఉక్రెయిన్
ఇది ‘డార్క్ స్టార్మ్’ పనేనా ?
‘ఎక్స్’పై సైబర్ దాడి వెనుక ‘డార్క్ స్టార్మ్’ అనే హ్యాకింగ్ గ్రూపు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇది పాలస్తీనా అనుకూల హ్యాకింగ్ గ్రూపు. ఇజ్రాయెల్‌కు మద్దతు నిలిచే వ్యక్తులు, సంస్థలపై ఇది సైబర్ దాడులు చేస్తుంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) పద్ధతిలో సైబర్ దాడులు చేయడం దీని ప్రత్యేకత. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉండే ప్రభుత్వాల వెబ్‌సైట్లను ‘డార్క్ స్టార్మ్’ లక్ష్యంగా ఎంచుకుంటుంది. రష్యా అనుకూల హ్యాకింగ్ గ్రూపులతో ‘డార్క్ స్టార్మ్’ కలిసి పనిచేస్తుంటుంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై గతంలో జరిగిన పలు సైబర్ దాడుల్లో ఈ గ్రూపు పాత్ర ఉంది. పర్సనల్ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల కెమెరాలు, ఇంటర్నెట్ రూటర్లను ‘డార్క్ స్టార్మ్’ హ్యాక్ చేయగలదు.