Site icon HashtagU Telugu

SpaceX : తప్పుడు కక్ష్యలోకి ‘స్టార్‌లింక్’ శాటిలైట్స్.. ఏమైందంటే..

Accident To Space X Rocket

SpaceX : ‘స్పేస్ ఎక్స్’‌ కంపెనీకి గత పదేళ్లలో తొలిసారిగా అతిపెద్ద వైఫల్యం ఎదురైంది. ఫాల్కన్ 9 రాకెట్ అనేది సేఫ్టీకి ప్రతీక అని స్పేస్ ఎక్స్ కంపెనీ చెప్పుకునేది. కానీ తాజా వైఫల్యంతో దానిపై అంచనాలు మారిపోయాయి.  గురువారం రాత్రి ఫాల్కన్ 9 రాకెట్‌ ద్వారా 20 స్టార్ లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రయోగించింది. అయితే ప్రయోగించిన కాసేపటికే.. భూమికి కేవలం 135 కిలోమీటర్ల దూరంలో రాకెట్ ప్రమాదానికి గురైంది. అప్పర్ స్టేజీ ఇంజిన్‌లో లోపం తలెత్తింది. లిక్విడ్ ఆక్సిజన్ లీకైంది. దీంతో ఫాల్కన్ 9 రాకెట్ తన లక్ష్యం దిశగా ముందుకు సాగలేకపోయింది.

We’re now on WhatsApp. Click to Join

ఈక్రమంలో ఫాల్కన్ 9 రాకెట్‌లోని దాదాపు 10 స్టార్ లింక్ శాటిలైట్లతో అమెరికాలోని స్పేస్ ఎక్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని  శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కనెక్ట్  అయ్యారు. ఆ శాటిలైట్లలో ఉండే అయాన్ థ్రస్టర్లను యాక్టివేట్ చేశారు. వాటి సహాయంలో ఎగువ కక్ష్యలోకి స్టార్ లింక్ శాటిలైట్లను(Starlink Satellites) తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే అది సాధ్యపడలేదు. భూమికి అత్యంత చేరువగా శాటిలైట్లు ఉండటంతో .. వాటిని ఎగువ కక్ష్యలోకి చేర్చేందుకు థ్రస్టర్ల నుంచి అందే శక్తి సరిపోలేదు. దీంతో ఆ 20 స్టార్ లింక్ శాటిలైట్లన్నీ తప్పుడు కక్ష్యల్లోకి వెళ్లిపోయాయి. అవి గాల్లోనే కాలిపోతాయని స్పేస్ ఎక్స్(SpaceX) కంపెనీ ప్రకటించింది. ఈ శాటిలైట్లన్నీ ఇంటర్నెట్ కనెక్షన్ సంబంధిత సేవలకు సంబంధించినవని తెలిపింది.

Also Read :Kirti Chakra : ‘కీర్తి చక్ర’ తీసుకొని కోడలు వెళ్లిపోయింది.. అమర సైనికుడు అన్షుమాన్ తల్లిదండ్రుల ఆరోపణ

ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X(గతంలో ట్విట్టర్) ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే 26 నుంచి జూన్ 25 మధ్యకాలంలో  X నుంచి  1.94 లక్షల భారతీయుల అకౌంట్లను తొలగించింది. వీటిలో 1,991 ఖాతాలను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే నెపంతో తొలగించారు. కొత్త ఐటీ రూల్స్ అమలులో భాగంగా,   ఇతర వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ఖాతాలను తొలగించినట్లు X వెల్లడించింది. ఐటీ రూల్స్ ఎగవేత కింద 5,289 ఖాతాలు, అడల్ట్ కంటెంట్ కింద 2,768 ఖాతాలు, హేట్ ఫుల్ కండక్ట్ కింద 2196 ఖాతాలు, వేధింపుల కంటెంట్ కింద 1243 ఎక్స్ అకౌంట్లను తొలగించారు.

Also Read :Skip Breakfast: ఉద‌యం టిఫిన్ మానేస్తున్నారా..? అయితే ఈ ప్రాబ్ల‌మ్స్ త‌ప్ప‌వు..!